మరో కీచక ప్రొఫెసర్... స్పెషల్ క్లాసుల పేరిట ఇంటికి పిలిచి...

Published : Oct 11, 2019, 10:44 AM IST
మరో కీచక ప్రొఫెసర్... స్పెషల్ క్లాసుల పేరిట ఇంటికి పిలిచి...

సారాంశం

 ఎంఏ ఇంగ్లీష్ చదివే విద్యార్థినులను డిపార్ట్ మెంట్ హెడ్ రాఘవేంద్ర గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిచేవాడు. నిజంగానే చదువు చెబుతాడనుకొని వెళ్లిన చాలా మంది విద్యార్థినులు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

విద్యా బుద్ధులు నేర్పించి.. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడే దారి తప్పాడు. తన దగ్గర  చదువు నేర్చుకుంటున్న విద్యార్థినులపై కన్నేశాడు. వారిని తన కామ వాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. కాగా... అతని కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నన్నయ యూనివర్శిటీలో ఓ కీచక ప్రొఫెసర్ కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఏ ఇంగ్లీష్ చదివే విద్యార్థినులను డిపార్ట్ మెంట్ హెడ్ రాఘవేంద్ర గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిచేవాడు. నిజంగానే చదువు చెబుతాడనుకొని వెళ్లిన చాలా మంది విద్యార్థినులు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

రోజు రోజుకీ అతని ఆగడాలు శృతిమించడంతో బాధిత విద్యార్థినులు ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. కాగా... విద్యార్థినులు రాసిన లేఖపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ జగన్.. ఉన్నత విద్యాశాఖ కు ఆదేశాలు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్