నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వైసీపీ మహిళా ఎంపీ వీడియో: ప్రేమికుడితో కలిసి...(వీడియో)

Published : Oct 11, 2019, 10:33 AM ISTUpdated : Oct 11, 2019, 06:09 PM IST
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వైసీపీ మహిళా ఎంపీ వీడియో: ప్రేమికుడితో కలిసి...(వీడియో)

సారాంశం

గొడ్డేటి మాధవి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆమె వెన్నంటే నిలిచారు శివప్రసాద్. ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 17న ఒక్కటికానున్నారు.  

విశాఖపట్నం: ఈనెల 17న పెళ్లిపీటలెక్కనున్నారు అరకు వైసీపీ మహిళా ఎంపీ గొడ్డేటి మాధవి. తన చిన్ననాటి స్నేహితుడు, విద్యాదాత అయినటువంటి కుసిరెడ్డి శివప్రసాద్ ను ఎంపీ మనువాడబోతున్నారు. 

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన శివప్రసాద్, ఎంపీ గొడ్డేటి మాధవి కలిసి చదువుకున్నారు. అయితే మాధవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఇకపోతే శివప్రసాద్ మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 

గొడ్డేటి మాధవి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆమె వెన్నంటే నిలిచారు శివప్రసాద్. ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 17న ఒక్కటికానున్నారు.

ఈ సందర్భంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, తన ప్రేమికుడు, కాబోయే భర్త అయిన శివప్రసాద్ తో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి యాక్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మేరేజ్ ఇన్విటేషన్ కోసం తెరకెక్కించిన 30 సెకన్ల వీడియో అందరి వాట్సప్ లలో హల్ చల్ చేస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

పెళ్లి పీటలెక్కనున్న వైసీపీ మహిళా ఎంపీ

"

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్