నంద్యాల ఎన్నికలో డ్రోన్లు నిఘా

First Published Aug 22, 2017, 1:09 PM IST
Highlights
  • నంద్యాల ఉప ఎన్నకకు కట్టుదిట్టమైనా భద్రత.
  •  ఎన్నికల్లో 3 డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
  • ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన తక్షణం చర్యలు.

నంద్యాల ఉప ఎన్నిక‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అంద‌రి దృష్టిని అక‌ర్షిస్తుంది. నిన్న‌టి వ‌ర‌కు ఇరు టీడీపీ, వైసీపి పార్టీలు నువ్వా-నేనా అనే స్థాయిలో ప్ర‌చారంలో మాట‌ల యుద్దం జ‌రిగింది. ఇక ప్ర‌చారం నిన్న‌టితో ముగిసింది. మిగిలింది ఎన్నికే.. రేపే పోలింగ్ కావ‌డంతో ఎన్నిక‌ల క‌మీష‌న్ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. 

ఇప్ప‌టికే 2,500 మంది పోలీసుల‌ను, ఆరు క్యాంపుల పారామిలిట‌రీ బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని తెలిపారు క‌ర్నూల్ సూప‌రిడెంట్ ఆప్ పోలీస్ గోపీనాథ్ జెట్టి. ఇక అదనపు పర్యవేక్షణ  కోసం డ్రోన్ల‌ను వాడుతున్నామ‌ని ఆయ‌న‌ తెలిపారు.   నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో చాలా పోలింగ్ బూత్‌లు సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామ‌న్నారు. అక్క‌డ‌ పరిస్థితిని పర్యవేక్షించటానికి మూడు డ్రోంలు నంద్య‌ాల‌ నియోజకవర్గంలో వినియోగించ‌బోతున్నట్లు జెట్టి తెలిపారు.

 ప్రతి పోలింగ్ కేంద్రాల, బూత్‌ల వ‌ద్ద‌ కెమెరాలు అమర్చామ‌ని ఆయ‌న తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి ప్రదేశం నుండి పూర్తి స్థాయిలో కెమోరా నిఘాలో జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి అసాంఘిక ప‌నులు జ‌రిగిన‌ త‌క్ష‌ణం పోలీసు బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకుంటాయ‌ని ఆయ‌న తెలిపారు.

 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

click me!