మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం.. సీఎం సీటులో జగన్‌ను తప్ప మరోకరిని ఊహించుకోలేం: ఎంపీ నందిగం సురేష్

Published : Jul 09, 2022, 11:50 AM IST
మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం.. సీఎం సీటులో జగన్‌ను తప్ప మరోకరిని ఊహించుకోలేం: ఎంపీ నందిగం సురేష్

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ  క్రమంలోనే ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీడీపై తీవ్ర విమర్శలు చేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ  క్రమంలోనే ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీడీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వందల ఎకరాలను  కొల్లగొట్టారని ఆరోపించారు. మూడు పంటల పండే భూములను చంద్రబాబు లాక్కున్నారని ఆరోపించారు. కేసుల పేరుతో రైతులను చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేశారు. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు తనవారికే లబ్ది చేకూర్చారని విమర్శించారు. చంద్రబాబు ఇష్టానురాజ్యంగా పాలన చేశారని ఆరోపించారు. ప్రధాని సభకు దళితులు హాజరుకాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. 

ముఖ్యమంత్రి సీటులో జగన్ తప్ప మరోకరిని ఊహించుకోలేమని చెప్పారు. దుష్ట శక్తులు ఏకమవుతున్నాయని.. కానీ అవి ఏమిచేయలేవని అన్నారు. పేదల పిల్లలు చదవుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. పేదల చదువులను అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్తున్నారని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలి.. మూడు ప్రాంతాలు అభివృద్ది జరగాలని అన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ వల్లే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. గతంలో హైదరాబాద్ విషయంలో దెబ్బతిన్నామని అన్నారు. మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతామని చెప్పారు. మూడు రాజధానులను తీసుకొస్తామని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?