మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నందమూరి రామకృష్ణ ఫైర్

By narsimha lode  |  First Published Jan 16, 2020, 1:48 PM IST

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నందమూరి రామకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. 


కాకినాడ: వైసీపికి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి నందమూరి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని రామకృష్ణ  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని హెచ్చరించారు.

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

Latest Videos

undefined

గురువారం నాడు నందమూరి రామకృష్ణ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Also read:పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

ఈ విషయమై నందమూరి రామకృష్ణ మండిపడ్డారు.  మేం గాజులు తొడుక్కోలేదని నందమూరి రామకృష్ణ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై సీరియస్ అయ్యారు.  చంద్రశేఖర్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలని నందమూరి రామకృష్ణ సూచించారు.

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఎమ్మెల్యే హోదాను మరిచిపోయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారని ఆయన గుర్తు చేశారుు. మేం నోరు తెరిస్తే మీ జాతకాలు బయటపడతాయని రామకృష్ణ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని హెచ్చరించారు.మా బావ చంద్రబాబును విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని రామకృష్ణ తేల్చి చెప్పారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూడు రాజధానులకు మద్దతుగా కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఈ రాళ్ల దాడిలో జనసేన కార్యకర్తలు గాయపడ్డారు.

రాళ్ల దాడిలో గాయపడిన జనసేన  కార్యకర్త పంతం నానాజీతో పాటు పలువురిని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఈ నెల 14వ తేదీన కాకినాడలో పరామర్శించారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


 

click me!