పురుష కమిషన్ ఏర్పాటు చేయాలి..నన్నపనేని వ్యంగ్యం

First Published May 30, 2018, 3:29 PM IST
Highlights

సీరియల్స్ చూసి క్రూరత్వం నేర్చుకుంటున్నారు

టీవీ సీరియళ్ల ప్రభావం మహిళలపై ఎక్కువగా పడుతోందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. డైలీ సీరియళ్లు ఎక్కువగా చూసి.. పురుషులపై దాడికి పాల్పడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. సీరియళ్లపై కూడా సెన్సార్ విధించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

సీరియళ్ల కారణంగా స్త్రీలల్లో క్రూరత్వం పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. మహిళల నుంచి పురుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందేమోనని ఆమె వ్యంగాస్త్రం వేశారు. ప్రస్తుత పరిస్థితులు ఆవిధంగానే ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఉత్తరాంధ్రలో పురుషులపై మహిళలు దాడుచేయడం దురదృష్టకరమని ఆమె భావించారు. ఈ ఘటన నేపథ్యంలోనే ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు. 

సీరియళ్లలో ఎలా చంపాలి..? ఎలా తప్పించుకోవాలి..? లాంటివి చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వాటిని చూసే భార్యలు భర్తలను దారుణంగా హత్య చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ సీరియల్ లో అందమైన అమ్మాయిలను పెట్టి.. వికృతమైన చర్యలను చూపిస్తున్నారని, ఆ అమ్మాయిలతో విషపు నవ్వులను చూపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలని తాను ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు.  

click me!