దెబ్బమీద దెబ్బ పడుతోంది

Published : Jun 16, 2017, 03:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
దెబ్బమీద దెబ్బ పడుతోంది

సారాంశం

ప్రతీ జిల్లాలోనూ నేతల మధ్య గొడవలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయ్. ఏం చేయాలో అర్ధంకాక చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

పార్టీలో జరుగుతున్న వరుస వివాదాలు, పరిణామాలతో చంద్రబాబునాయుడు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఒకపుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే అందరూ వణికిపోయేవారు. అటువంటిది ఇపుడు చంద్రబాబును ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. పైగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆయనకు సంబంధం లేకుండా జరిగిపోతున్నాయి. దాంతో పరిణామాలను నియంత్రించలేక, అటు వివాదాలను అదుదపులో పెట్టలేక చంద్రబాబు అవస్తులు పడుతున్నారు.

ఈ పరిస్ధితి ఏ ఒక్క జిల్లాకో, ఏ ఇద్దరు నేతలకో పరిమితం కాలేదు. దాదాపు అన్నీ జిల్లాలోనూ, అన్నీ స్ధాయిల్లోనూ కనబడుతోంది. చంద్రబాబు నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటున్న మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు బాహాటంగానే కలహించుకుంటున్నారు. అసలే విశాఖపట్నంలో భూకుంభకోణంతో ఇబ్బందులు పడుతున్న చంద్రబాబుకు శిల్పా వైసీపీలో చేరటంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు.

దానిపై ఎంపి జెసి దివాకర్ రెడ్డి వివాదం మొదలైంది. అదనంగా నంద్యాల, ఆళ్ళగడ్డలో ఇంతకాలం భూమా కుటుంబం తరపున అన్నీ వ్యవహారాలు చక్కబెడుతున్న కీలక నేత ఎవి సుబ్బారెడ్డి టిడిపిలో తిరుగుబాటు మొదలుపెట్టారు. మంత్రి అఖిలప్రియతో కలిసి పని చేసేందుకు తాను సుముఖంగా లేనంటూ ప్రకటించటం సంచలనంగా మారింది.

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్-ఎంఎల్సీ కరణం బలరాంలు నేరుగానే కొట్టేసుకున్నారు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబంతో శిల్పా-గంగుల, కుటుంబాలకున్న వైరం అందరికీ తెలిసిందే. భూమా మరణం తర్వాత గంగుల కుటుంబంతో పాటు శిల్పా మోహన్ రెడ్డి కూడా వైసీపీలో చేరిపోయారు.

కడప జిల్లాలో మంత్రి ఆది నారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. గుంటూరులో ఎంపి రాయపాటి సాంబశివరావు, గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డిలు ప్రభుత్వంపై బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు అరాచకాలకు అడ్డే లేదు. కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలాగ తయారయ్యారు. పదే పదే ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి చింతమనేని మీదనే పార్టీలోని ప్రత్యర్ధులు హత్యకు కుట్ర చేయటం పార్టీలో సంచలనంగా మారింది. అదే విధంగా తణుకు ఎంఎల్ఏ రాధాకృష్ణ ఓ ఎస్ఐని కార్యాలయంలో నిర్భందించటం సంచలనంగా మారింది. ఇలా ప్రతీ జిల్లాలోనూ నేతల మధ్య గొడవలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయ్. ఏం చేయాలో అర్ధంకాక చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu