అసెంబ్లీలో జగన్ ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదా?

Published : Mar 22, 2017, 01:23 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
అసెంబ్లీలో జగన్ ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదా?

సారాంశం

అసెంబ్లీలో జగన్ ఉండటాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. జగన్, వైసీపీ గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు మొహంలో స్పష్టంగా ఆ విషయం తెలిసిపోతోంది.

అసెంబ్లీలో ఆధిపత్య పోరాటం నడుస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఏ విషయంలో కూడా సయోధ్య కుదరకపోవటంతోనే విలువైన సభా సమయం వృధా అవుతోంది. సభా నాయకుడు చంద్రబాబునాయడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఇగో ప్రాబ్లెమ్ తోనే సమస్యలపై చర్చ జరగకుండానే సభా సమయం అయిపోతోంది. రాష్ట్రంలో కరువు, పంటలకు గిట్టుబాటుధరలు లేకపోవటం,రుణమాఫి,పోలవరం,రాజధానినిర్మాణాలకునిధులలేమి, ఇలా...సమస్యలైతే అనేకమున్నాయ్. కానీ చర్చే జరగటం లేదు.

సభ నిర్వహణ సజావుగా సాగటానికి అధికార పార్టీనే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే, ప్రతిపక్షం ఉన్నదే సమస్యలు లేవనెత్తేందుకు. సమస్యల గురించి మాట్లాడటంలో ప్రతిపక్షం కొద్దిగా అతి చేసినా చేయవచ్చు. అపుడు అధికార పక్షం సంయమనం పాటించాలి. కానీ జరుగుతున్నదేమిటి? అధికారపక్షమే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చ గొడుతోంది. గడచిన మూడేళ్లుగా  జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి వైసీపీ ప్రస్తావించగానే, టిడిపి వెంటనే వైఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ మొదలుపెడుతోంది. జగన్ను చంద్రబాబు శత్రువులా చూస్తున్నారు. టిడిపికి ఓట్లేసిన ప్రజలే వైసీపీకి కూడా వేసారన్న విషయాన్ని మరచిపోతున్నారు. అసెంబ్లీలో జగన్ ఉండటాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. జగన్, వైసీపీ గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు మొహంలో స్పష్టంగా ఆ విషయం తెలిసిపోతోంది.

పదేళ్ల క్రితం వ్యవహారాల గురించి ఇపుడెందుకు. అంటే ఇప్పటి వ్యవహారాలపై ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కావాలనే వైఎస్ హయాం నాటి అంశాలను టిడిపి లేవనెత్తుతోంది. సభలో జరుగుతున్న చర్చకు ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలనే టిడిపి జగన్ లక్ష కోట్లు తిన్నాడు, ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి సంతకాలు చేసి వస్తాడంటూ రెచ్చగొడుతున్నారు. దాంతో వైసీపీ రెచ్చిపోవటం వల్ల గొడవలవుతున్నాయి. దాంతో సభలో గందరగోళం జరుగుతోంది.

అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రెండు రోజులు బాగానే నడిచింది. సభలో కొన్ని అంశాలపై చర్చ కూడా సాగింది. దాంతో ప్రభుత్వాన్ని జగన్ బాగా ఇరుకునపెట్టారంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. దాన్ని టిడిపి తట్టుకోలేకపోయింది. అందుకే సభలో వైసీపీని రెచ్చగొట్టి టిడిపి గొడవలకు ఈడుస్తున్నది. తెలంగాణా అసెంబ్లీ జరుగుతున్న విధానాన్ని చూస్తూ కూడా మన నేతల తీరు మారకపోతే చేసేదేం లేదు. ఇటు టిడిపి, అటు వైసీపీకి నష్టమేమీ లేదుకానీ  వృధాఅవుతోంది ప్రజాధనమన్న సంగతి గ్రహించాలి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?