
తెలుగుదేశం పార్టీ మళ్ళీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. వైసీపీకి చెందిన పలువురు ఎంఎల్ఏ, ఎంపిలు తమతో టచ్ లోఉన్నారంటూ టిడిపి ప్రచారానికి దిగింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల ఎంఎల్సీ స్ధానాలను గెలిచిందో లేదో అప్పుడే ఎటాక్ మొదలుపెట్టేసింది. టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ, జగన్ సొంత జిల్లాలో తమ పార్టీ ఎంఎల్సీ సీటు గెలవటం చారిత్రాత్మకమన్నారు. సిఎం సూచనలతో కామన్ మ్యాన్ బిటెక్ రవిని బరిలోకి దింపి ఘన విజయాన్ని సాధించినట్లు చెప్పుకొచ్చారు. మరి, బిటెక్ రవి కామన్ అయితే, ఎన్నికల్లో గెలుపుకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో మాత్రం చెప్పలేదు. కడప విజయం చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఉగాది కానుకగా ఇవ్వనున్నట్లు కూడా చెప్పారండోయ్. మరి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటమికి బాధ్యత ఎవరిదో కూడా చెప్పి వుంటే బాగుండేది.