కాపుల్లో చీలిక- బలిజలకు మాత్రమే బిసి హోదా?

First Published Dec 31, 2016, 4:13 AM IST
Highlights

కోస్తా కాపులనుంచి రాయలసీమ బలిజలను వేరు చేసేందుకు వారికి బిసి హోదా కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం

కాపులు బిలిజలు వేరువుతారా?

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కాపులను బలిజలను విడదీసేందుకు పథకం వేసినట్లు తెలుస్తున్నది.

 

ఇది పూర్తయితే కాపులు రాయలసీమ బలిజలు వేరవుతారు.కాట్టాడుతుకుంటారు. 

 

ప్రాంతీయ అసమానాతలు కులాలలో కూడా ఉంటాయి. అందువల్ల  వారిని రాజకీయంగా విడదీయడం సులభం. ఇపుడు టిడిపి ఆ ప్రయోగం చేస్తున్నది.

 

ఇక భవిష్యత్తులో  కాపు ఐక్యత అనే నినాదం  ఉండదు. ఈ లక్ష్యం నెరవేర్చేందుకు రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో  ఉన్న బలిజలకు మేలు చేకూర్చేందుకు వారిని బిసిలలో చేర్చే ప్రతిపాదన సిద్ధమవుతూ ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

 

బిసి కమిషన్  ఛెయిర్మన్ జస్టిస్ మంజునాథ  కాపులలో బలిజలను మాత్రం బిసిలుగా గుర్తించాలని రాష్ట్రానికి సిఫార్స్ చేయనున్నట్లు మాకు అందిన సమాచారం.వెనకబడిన రాయలసీమ లో వారు బాగా వెనకబడ్డారన్నది ప్రధాన అర్హత. దీనికి సమాచార సేకరణ పూర్తయిందని తెలిసింది.

 

ఈ ఏడాది లో బలిజను బిసిలలో చేర్చడం పూర్తవుతుంది. కాపులు, బలిజలు వేరవుతారు. తర్వాత ఎవరో కోర్టు కెళతారు.బలిజల బిసి స్టేటస్ మీద స్టే వస్తుంది. అప్పటినుంచి బలిజలు మా బిసిస్టేటస్ పునరుద్ధరించండని పోరాటం చేస్తూ ఉంటారు. కాపులతో కలవడం మానేస్తారు.  ఇది రాజకీయ వ్యూహం అని తెలిసింది.

 

ఇపుడు ఉత్తరాంధ్ర జిల్లాలలోని తూర్పుకాపులు కోస్తాకాపులతో కలవక పోవడానికి కారణం ఇదే. తూర్పు కాపులు బిసిలలో ఉన్నారు. కోస్తాకాపుల ఏకైక డిమాండ్ బిసి స్టేటస్ . ఈ డిమాండ్  కోసం జరిగే పోరాటం తూర్పు కాపులకి అవసరం లేదు.  అందుకే కళా వెంకటరావుకు  తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇచ్చి (ఎన్టీ ఆర్ కుటుంబానికి చెందాల్సిన ’గౌరవం‘) ఆయన కాపు ఉద్యమంలో కలవకుండా చేశారు.  ఉద్యమంలో ఉన్నవారికి నిమ్మరసం అందించడం ఆయన పని.

 

ఇపుడు ఇదే బిసి స్టేటస్ తో రాయలసీమ బలిజలు కూడా విశ్వాస పాత్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మద్దతు పలకవచ్చు.

 

కాపులకు రాజ్యాధికారం అన్నపుడే అన్ని ప్రాంతాలలోని కాపులు కలిసే అవకాశం ఉంటుంది. చిరంజీవి ప్రయోగం విఫలమమయ్యాక కాపులు రాజ్యాధికారం కోసం  పోరాడే అవకాశం తక్కువ.  రాజ్యాధికారం  తర్వాతి పెద్ద డిమాండ్ బిసి స్టేటస్. ఈ బిసి స్టేటస్ ను కూడా ప్రాంతాలు వారి గా అందిస్తే కాపులు పర్మనెంటుగా విడిపోయి, తూర్పు కాపు, రాయలసీమ బలిజ, కోస్తాకాపులనే చిన్న చిన్నగ్రూపులవుతారు. అపుడు ఈ గ్రూపులను పదవుల ద్వారా మచ్చిక చేసుకోవడం ఈజీ.

 

చెప్పొచ్చేదేమంటే, ముద్రగడ అన్ని ప్రాంతాల కాపులకు నాయకుడిగా తయారవకుండా అడ్డుకోవాలన్నది ముఖ్యం. దీనికి బలిజలకు బిసి స్టేటస్ ఇవ్వాలి. అపుడు కోస్తాకాపులు తూ.గో; ప.గో;  కృష్ణా జిల్లాలకే పరిమితమయి మైనారిటీ గా తయారవుతారు.

 

కాపులందరు కలిస్తే  21 శాతం  జనాభా అవుతారని, అందువల్ల వాళ్లు రాజకీయ శక్తి గా ఎదగాలని ఆశిస్తారని చాలా వర్గాల్లో  ప్రచారం లోఉంది.  ఈ కాన్సెప్ట్ మీద అధారపడే ‘ప్రజారాజ్యం ’పురుడు పోసుకుంది. అది విజయవంతం కాలేదు. భవిష్యత్తులో మళ్లీ కాపులు తమ  జనాభా లెక్కలు చూపి రాజ్యాధికారం కోసంపోటీ పడకుండా ఉండేందుకు బలిజలను ‘బిసి’ ఎరవేసి విడదీస్తే సరి అన్నది టిడిపి వ్యూహమని తెలిసింది.

 

తొందరల్లో టిడిపి అనుకూల వర్గానికి చెందిన బలిజ నాయకులు రాయలసీమ అన్ని జిల్లాల్లో బలిజ ఐక్యత సమావేశాలను ఏర్పాటుచేసి చివర ఒక బలిజమహాసభను ఏర్పాటుచేస్తారట.

 

‘మనకు కోస్తా నాయకత్వం (ముద్రగడ నాయకత్వం) వద్దు, మన సమస్యలు వేరు, వారి సమస్యలు వేరు, మన నాయకత్వం మనకు అవసరం,అనేదిమా నినాదం’ అని రాయలసీమకు చెందిన బలిజ నాయకుడొకరు  ‘ఎషియానెట్-తెలుగు ’ కు చెప్పారు. బలిజ సమీకరణకు పూనుకోవాలని టిటిడి మాజీ సభ్యుడు బలిజ ఫ్రంట్ నాయకుడు ఒ వి రమణను  టిడిపి పురమాయించినట్లు సమాచారం.

click me!