చంద్రబాబు మారడంతే

Published : Dec 30, 2016, 10:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
చంద్రబాబు మారడంతే

సారాంశం

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ, సాంకేతిక అనుమతులను సాధించింది వైఎస్సే. కాల్వ పనులు ప్రారంభమైంది కూడా వైఎస్ హయాంలోనే.

చంద్రబాబు ఏది చేసినా అంతే. ప్రతీదానిలోనూ ప్రచార యావే. తాజాగా జరిగిన పోలవరం కాంక్రీట్ పనుల శంకుస్ధాపన కార్యక్రమంలో కూడా అదే జరిగింది. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం తప్ప ఇంకేమి ఉండదు. అందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనం తగలేయటం.

 

చెప్పిందే చెప్పి విసిగించేస్తున్నారు. దాదాపు గంటసేప మాట్లాడిన చంద్రబాబు అనేక సందర్భాల్లో సభలో పాల్గొన్న వాళ్లని చప్పట్లు కొట్టమని అడిగినా పెద్దగా స్పందిచకపోవటమే అందుకు నిదర్శనం.

 

ఇక, పోలవరం ప్రాజెక్టుకు 1980లో శంకుస్ధాపన జరిగిన తర్వాత తాను సిఎం అయిన తర్వాత శుక్రవారమే మోక్షం వచ్చినట్లు చెప్పుకున్నారు. గతంలో జరిగిన పనులను కూడా తన హయాంలోనే జరిగినట్లు కలరింగ్ ఇచ్చుకోవటం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

 

1980లో శంకుస్ధాప చేసిన తర్వాత మళ్లీ పనులు మొదలైంది 2004లో వైఎస్ హయాంలోనే. ఆ విషయం తెలీసీ ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించాలని అనుకున్నారు.

 

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ, సాంకేతిక అనుమతులను సాధించింది వైఎస్సే. కాల్వ పనులు ప్రారంభమైంది కూడా వైఎస్ హయాంలోనే. అయితే, 2009లో వైఎస్ హటాత్తుగా మరణించారు.

 

అప్పటికే ప్రత్యేక తెలంగాణా కోసం వినబడుతున్న డిమాండ్లు ఊపందుకుని ఉద్యమరూపం దాల్చాయి. దాంతో సమైక్య రాష్ట్రంలో నిర్మాణత్మకమైన పనులు అన్నీ మూలపడ్డాయి. అందులో భాగంగా పోలవరం పనులు కూడా అటకెక్కింది. ఇది వాస్తవం.

 

అయితే, వాస్తవాలకు మసిపూసి చంద్రబాబు మారేడుకాయని చేద్దామని ప్రయత్నించారు. పోలవరం నిర్మాణానికి అవసరమైన తెలంగాణాలోని 7 మండలాలను ఏపిలో కలపకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని మోడితో చెప్పానని చంద్రబాబు చెప్పటం పలువురు ఆశ్చర్యపరిచింది.

 

ఎందుకంటే ఇంత వరకూ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. మరి ఇంతటి గొప్ప విషయాన్ని బాబు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచారో ఎవరికీ తెలీటం  లేదు. తాను చెప్పటంతోనే ప్రధాని వెంటనే(భయపడి!)స్పందించి 7 మండలాలను ఏపిలో కలిపినట్లు చెప్పుకున్నారు. అందుకే చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాళ్లు ఏపి ప్రజలని వేళాకోళం జరుగుతోంది.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?