
పోలవరం తాజా లెక్క రూ. 50 వేల కోట్లకు చేరింది. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ప్రాజెక్టు వ్యయాన్ని ముందు రూ. 32 వేల కోట్లకు పెంచారు. తర్వాత రూ. 43 వేలకోట్లన్నారు. తాజాగా రూ. 50 వేల కోట్లంటున్నారు. భవిష్యత్తులో ఇంకెతంతకు పెరుగుతుందో తెలీదు. అసలు అన్నేసి వేల కోట్లకు ఎందుకు పెంచుతున్నారో కూడా అర్ధం కావటం లేదు.
ఒకవైపు కేంద్రం నిధులిచ్చే పరిస్ధితి కనపడటం లేదు. ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఇప్పటికే కేంద్ర నుండి రూ. 14 వేల కోట్లు రావాలని ఈమధ్యే శెలవిచ్చారు. నిధుల కోసం కేంద్రంతో పోరాటమే చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. మరి, తన ఇష్టం వచ్చినట్లు అంచనా వ్యయాలను పెంచుకుంటూ పోతుంటే ఎవరొప్పుకుంటారు?
పోనీ పనులేమైనా వేగంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. పనులు దక్కించుకున్న ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ నత్తకే నడకలు నేర్పిస్తోంది. కేంద్రం వద్ద కంపెనీపై బోలెడు ఫిర్యాదులున్నాయి. జరుగుతున్న పనుల విషయంలో కేంద్రానికి కూడా పెద్దగా నమ్మకాల్లేవు ప్రాజెక్టు త్వరగా పూర్తవతుందని. ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు ప్రాజెక్టు కాస్ట్ ను రూ. 50 వేల కోట్లకు పెంచటం గమనార్హం. పైగా తన చేతకాని తనన్ని కప్పి పుచ్చుకునేందుకు రాజకీయాల కోసం పోలవరం పనులకు అడ్డుతగులుతున్నట్లు పరోక్షంగా వైసీపీ మీద పడి ఏడుస్తుంటారు ఎప్పుడూ.