2019 ఎన్నికలకు సిద్ధమేనా ?

Published : Sep 18, 2017, 02:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
2019 ఎన్నికలకు సిద్ధమేనా ?

సారాంశం

వై.ఎస్‌.షర్మిల 2019 ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా?  అవుననే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం పార్టీ కార్యక్రమాల్లో కనిపించటానికి మాత్రమే పరిమితమైన షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని వైసీపీ వర్గాలంటున్నాయి. పోయిన ఎన్నికల్లోనే షర్మిల పోటీ చేస్తారని ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

వై.ఎస్‌.షర్మిల 2019 ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా?  అవుననే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం పార్టీ కార్యక్రమాల్లో కనిపించటానికి మాత్రమే పరిమితమైన షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని వైసీపీ వర్గాలంటున్నాయి. పోయిన ఎన్నికల్లోనే షర్మిల పోటీ చేస్తారని ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, పులివెందుల, విశాఖపట్నం, కడప, కమలాపురం, ఒంగోలులో కుటుంబసభ్యులే పోటీ చేయటంతో చివరకు షర్మిల విరమించుకున్నట్లున్నారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి పోటీ చేయటం లేదని సమాచారం. అదేవిధంగా వైఎస్ విజయమ్మ కూడా పోటీకి దూరంగానే ఉంటారట. అందుకనే షర్మిల పోటికి లైన్ క్లియరైనట్లు ప్రచారం జరుగుతోంది. కడప, విశాఖపట్నం లేదా ఒంగోలు ఎంపీ స్థానాల్లో ఎక్కడో ఓ చోట పోటీ చేయటం ఖాయమని ప్రచారం మొదలైంది. అయితే కొందరు సీనియర్లు మాత్రం గత ఎన్నికల్లో జగన్ తల్లి వైఎస్‌.విజయలక్ష్మి ఓడిపోయిన విశాఖలోనే షర్మిలను పోటీ చేయించి గెలిపించుకోవడం ద్వారా సత్తా చాటాలని చెబుతున్నారట. చూడబోతే వచ్చే ఎన్నికల్లో ఇటు టిడిపి అటు వైసీపీ తరపున చాలా పెద్ద తలకాయలే పోటీలో ఉండేట్లున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఆల్రెడీ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం, నేడు ఇంకొకటి రెడీ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. రూపాయి ఖర్చు లేకుండానే ఐఏఎస్, ఐపిఎస్ కలను నిజం చేసుకొండి