
రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టిడిపికి ఇబ్బందులు తప్పవా? చంద్రబాబు ఆగ్రహం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం జరుగుతోంది కదా? కార్యక్రమాన్ని బాగా నిర్వహించిన జిల్లాలకు చంద్రబాబు గ్రేడ్లు ఇచ్చారు. ఆ సందర్భంగా బుధవారం నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో సిఎం అనంతపురం జిల్లా నేతలపై ఫైర్ అయ్యారు. టిడిపి కంచుకోట లాంటి జిల్లాను నేతలంతా కలిసి నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ నిర్వహించిన ఎటువంటి కార్యక్రమంలోనైనా జిల్లాకు సి గ్రేడు దాటి రావటం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇందరు నేతలుండి ఏం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
పరిస్ధితి ఇదే విధంగా ఉంటే రానున్న ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్నట్లుగా హెచ్చరించారు. పార్టీ అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహణలో కూడా జిల్లాకు సి గ్రేడ్ రావటంపై మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలకు బీ గ్రేడ్ రావటంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు ఏ గ్రేడు ఇచ్చారు. సెంట్రల్, ఈస్ట్ నియోజకవర్గాల్లో కార్యక్రమం బాగా జరిగిందని అభినందించారు.