
వివాదాస్పద రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తాజాగా రాసిన పుస్తకం ఏపిలో ఎవరికీ అందుబాటులో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం మాట్లాడుతూ, ఇతరుల మనోభావాలను దెబ్బతినేలా పుస్తకాలు రాయటం సరికాదని అభిప్రాయపడ్డారు. కంచెఐలయ్య రాసిన ‘‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు’’ అనే పుస్తకం పై గడచిన కొద్ది రోజులుగా ఉభయ రాష్ట్రాల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆ పుస్తకాన్ని ఉభయ రాష్ట్రాల్లోనూ బ్యాన్ చేయాలని వైశ్య సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం అందరకీ తెలిసిందే. తెలంగాణాలో కెసిఆర్ పట్టించుకోలేదు. అయితే చంద్రబాబు మాత్రం పుస్తకాన్ని బ్యాన్ చేస్తానని చెబుతున్నారు.