ఆ ఎంవోయు ల సంగతేంటి? : ముఖ్యమంత్రి ఆరా

Published : Mar 14, 2017, 11:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఆ ఎంవోయు ల సంగతేంటి? : ముఖ్యమంత్రి ఆరా

సారాంశం

గత రెండేళ్ల లో కుదుర్చుకున్న ఎంవోయు లన్నీంటిని అమలు చేసే వ్యూహం పై ముఖ్యమంత్రి సమాలోచనలు

 రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలుచేసి,తొందరగా తెలుగు యువకులు ఉపాది,ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు మొలుపెట్టారు.

 

రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఇప్పటివరకు అన్ని శాఖలు కలిపి ఇప్పటివరకు 1,168 ఎంవోయూలు కుదుర్చుకోగా, రూ. 16,24,262 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకువచ్చాయి, ఇవి పూర్తిగా కార్యరూపం దాల్చితే 32,55,816 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కలగనున్నాయి./

 

2015-16, 2016-17లలో విశాఖ లో జరిగిన రెండు సిఐఐ భాగస్వామ్య  సదస్సులలో  మొత్తం ఎన్ని ఎంవోయూలు కుదిరాయి, వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎన్ని సమావేశాలు నిర్వహించారు, ఎన్ని డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి, ఈ ఏడాది మే నెల నాటికి ఎన్ని కార్యరూపం దాలుస్తాయనే విషయాలపై కొద్ది సేపటికి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధికారులతో సమీక్ష మొదలుపెట్టారు.

 

ఈ సమావేశంలో అధికారులు అందించిన సమాచారం ప్రకారం-

 

ఇందులో 2017లో జరిగిన భాగస్వామ్య సదస్సులోనే రూ. 10,54,596 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 664 ఒప్పందాలు జరిగాయి.

 

మొత్తం ఎంవోయూలు కుదుర్చుకున్నవాటిలో 134 సంస్థలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి, ఈ పెట్టుబడుల విలువ రూ.64,250 కోట్లు, 52,305 మందికి ఉపాధి కలిగింది

 

భాగస్వామ్య సదస్సు-2016లో 328 ఎంవోయూలు చేసుకోగా, రూ. 4,61,748 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆశక్తి చూపాయి

 

ఈరెండు సదస్సుల్లో కాకుండా మరో రూ. 1,07,917 కోట్ల పెట్టుబడులకు 176 ఎంవోయూ కుదిరాయి.

రాష్ట్రంలో వున్న వనరుల ఆధారంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిశ్రమలు స్థాపించవచ్చో అధ్యయనం చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు

 

మన రాష్ట్రానికి వున్న అవకాశాలు దేశంలో మరే రాష్ట్రానికి లేవు, ఈ అవకాశాలను అధికారులు వినియోగించుకుని రాష్ట్రానికి పెట్టుబడులు పెద్దఎత్తున వచ్చేలా ప్రయత్నించాలి

 

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వుండాలి

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?