భూమా ఆళ్లగడ్డ ఎంఎల్ఏనా ?

First Published Mar 14, 2017, 10:47 AM IST
Highlights

సంతాప సమావేశంలో పల్లె మాట్లాడుతూ, ఆళ్ళగడ్డ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతిచెందటం నిజంగా బాధాకరమన్నారు.

 పల్లె రఘునాధరెడ్డికి భూమా నాగిరెడ్డి ఏ నియోజకవర్గం ఎంఎల్ఏనో కూడా తెలీదు. ఉన్న వాళ్ళను పోయినోళ్ళతో కలిపేస్తున్నారు. రెండు రోజుల క్రితం మరణించిన భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గం శాసనసభ్యుడు. 2014 ఎన్నికల్లో సందర్భంగా ఆయన శ్రీమతి శోభా నాగిరెడ్డి ఆళ్ళగడ్డ నియోజకవర్గం నామినేషన్ వేసారు. అప్పటికే ఆమె సిట్టింగ్ ఎంఎల్ఏ. అయితే, పోలింగ్ కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దాంతో ఆమె కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ అఖిలప్రియే.

 

అసెంబ్లీలో మంగళవారం జరిగిన భూమా సంతాప సమావేశంలో పల్లె మాట్లాడుతూ, ఆళ్ళగడ్డ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతిచెందటం నిజంగా బాధాకరమన్నారు. ఏదీ...ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ అఖిలప్రియ సభలో ఉండగానే. పైగా మరణించిన భూమా, సభలో ఉన్న అఖిలప్రియ తండ్రీ కూతుళ్లన్న విషయం అందరికీ తెలిసిందే. తెలిసి కూడా పల్లె ఇలా మాట్లాడారంటే ఏమనుకోవాలి? పల్లె ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. చంద్రబాబు రోజుకు 36 గంటలు పనిచేస్తున్నారని గతంలో  చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొన్న కూడా ఏదో సందర్భంలో మాట్లాడుతూ, చంద్రబాబు పరిపాలన గురించి ఏపిలోని రెండు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. పల్లె విచిత్రాలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి లేండి.

                               

 

 

click me!