నంద్యాలలో పోటీ తప్పదా?

Published : Mar 14, 2017, 08:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
నంద్యాలలో పోటీ తప్పదా?

సారాంశం

సీటును ఏ పార్టీ కూడా ఎదుటి పార్టీకి వదిలేయటానికి సిద్ధంగా లేదు. ఈ పరిస్ధితుల్లో నంద్యాల నియోజకవర్గంలో పోటీ తప్పదనిపిస్తోంది.

నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ తప్పేట్లు లేదు. మృతిచెందిన ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్న విషయమై వివాదం మొదలైంది. తమ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు కాబట్టి భూమా తమ పార్టీ ఎంఎల్ఏనే అంటూ వైసీపీ అంటోంది. తమ పార్టీలో ఉన్నారు కాబట్టి భూమా తమ పార్టీ ఎంఎల్ఏనే అంటూ టిడిపి చెబుతోంది. ఇందులో ఏది కరెక్ట్ అంటే ‘విత్తు ముందా చెట్టు ముందా’ అన్న ప్రశ్నలాంటిదే. సాంకేతికంగా భూమా వైసీపీ ఎంఎల్ఏనే. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే, కారణాలేవైనా ఏడాదిక్రితం టిడిపిలోకి ఫిరాయించారు.

 

ఇపుడిదాంతా ఎందుకంటే, రేపు నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతుందా, జరగదా అన్న ప్రశ్న మొదలైంది అపుడే. అందుకే, టిడిపి, వైసీపీ నేతలు భూమా తమ సభ్యుడంటే  కాదు తమ సభ్యుడని మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఆనవాయితీ ఏమిటంటే ఎవరైనా సభ్యుడు హటాత్తుగా మరణిస్తే, ఆ స్ధానంలో ఇతర పార్టీలు పోటీ పెట్టకూడదు. ఒక్కోసారి ఆనవాయితీ తప్పతోంది. భూమా పార్టీ ఫిరాయించిన దగ్గర నుండి రాజీనామా చేయించి ఉప ఎన్నిక నిర్వహించమని వైసీపీ కోరుతున్నది. అందుకు టిడిపి వెనకాడుతోంది. ఒకదశలో తాను రాజీనామా చేస్తానని చెప్పినా చంద్రబాబు అంగీకరించేదని తన సన్నిహితులతో భూమా చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది.

 

ఇటువంటి పరిస్ధితుల్లో హటాత్తుగా భూమా మరణించారు. ఆ సీటులో ఏ పార్టీ అభ్యర్ధి నామినేషన్ వేయాలనే విషయంలో సమస్య మొదలైంది. సీటు వైసీపీదని తేలితే టిడిపి పోటీ పెట్టకూడదు. అదే టిడిపిదని తేలితే వైసీపీ పోటీలో ఉండకూడదు. అయితే, సీటును ఏ పార్టీ కూడా ఎదుటి పార్టీకి వదిలేయటానికి సిద్ధంగా లేదు. ఈ పరిస్ధితుల్లో నంద్యాల నయోజకవర్గంలో పోటీ తప్పదనిపిస్తోంది. ఎందుకంటే, నంద్యాలలో పోటీ జరగాలని వైసీపీ, పోటీలేకుండా సొంతం చేసుకోవాలని టిడిపి భావిస్తున్నాయి.  ఈనెల 20వ తేదీన జరుగనున్న ఎంఎల్సీ ఎన్నిక ఫలితం తర్వాత ఉప ఎన్నిక విషయంపై ఒక అంచనాకు రావచ్చు. పోటీ తప్పకపోతే ఎంఎల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకు వైసీపీ అభ్యర్ధి కావచ్చంటున్నారు. టిడిపి ఇంకా నిర్ణయించుకోలేదు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?