నాయుడుగారి మాటలకు అర్థం మారుతూ ఉంటుంది

Published : Apr 28, 2017, 02:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
నాయుడుగారి మాటలకు అర్థం మారుతూ ఉంటుంది

సారాంశం

నిత్యం శీల పరీక్ష చేసుకోవడం మంచిది కాదు.ఒకసారి ముందస్తుకెళ్లి తప్పుచేశా

ఎన్నికలు ఎపుడొచ్చినా సిద్ధమన్నాం గాని, దానర్థం  2019 ఎన్నికలను ముందుకు జరమని కాదు,  అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ‘ముందస్తు’ ప్రకటనలకి వివరణ ఇచ్చారు.

 

రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు  సంతృప్తిగా ఉన్నారని  ప్రజలకోసం ప్రకటించిన ముఖ్యమంత్రి లోలోన ఈ లెక్కలను అనుమానిస్తున్నాట్లున్నారు. 

 

అందుకే సడన్ గా ఇపుడు కుమారుడు లోకేశ్ తో కలసి కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టారు.  ఎన్నికలకు ఎపుడయినా సిద్ధం అన్నాంగాని ముందస్తు అని అనలేదేఅని దబాయిస్తున్నారు. ‘కాదు, మీరు  అన్నారు, ఇదిగో సాక్ష్యం’ అని ఎవరు పోట్లాడగలరు. అందుకే వెలగపూడిలో విలేకరులతో మాట్లాడుతూ తన మాటలకు తానే కొత్త అర్థం చెప్పుకున్నారు.

 

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో, నిజాయితీతో చేస్తున్నామని, ఎన్నికలు ఎపుడొచ్చినా  గెలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వైపు కాలర్ ఎగరేశారు. మరి ‘ముందస్తుకు సిద్ధమా’ అని ఒక పత్రికాయన ప్రశ్నించగా... ‘ముందస్తు అని మాత్రమేకాదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం’ అని అంటూనే ఇలాఅన్నారు, ‘‘కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక ప్రతి మూన్నెళ్ల కొకసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క వార్డులో ఓడిపోయినా అదే పెద్ద విశేషంగా మారుతోంది. పూర్తిగా పరిపాలన సాగించడం మీద దృష్టి పెట్టకుండా, స్థానిక ఎన్నికల్లో గెల్చడం మీదే దృష్టి పెట్టి రోజూ శీల పరీక్ష చేసుకోవాల్సిందేనా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

 

ఒకసారి ముందస్తుకెళ్లి తప్పుచేశానని కూడా ఒప్పుకున్నారు.

 

నిన్ననే మరొక సమావేశంలో లోకేశ్ తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లేదే లేదని స్పష్టం చేశారు.

 

సర్వేలలో పరిస్థితి అనుకూలంగా లేదని రావడం, ఈ మధ్య తెలుగు త మ్ముళ్ల లో తిరుగాబాట్లు, అమరావతి లో ఒక్క ఇటుక పడకపోవడం, పోలవరం సౌండ్ తప్ప పెద్దగా పనిజరగపోతు ఉండటం... వల్ల ఎన్నికలకు ఎపుడయినా సిద్ధమనే మాటకి అర్థం మారిపోతున్నది.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu