అఖిల బాగా ఇరుక్కుపోయింది

Published : Apr 28, 2017, 02:37 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
అఖిల బాగా ఇరుక్కుపోయింది

సారాంశం

శిల్పాకు టిక్కెట్టు ఇస్తే భూమా వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేందు. ఇటువంటి పరిస్ధితుల్లో మళ్ళీ శిల్పా గెలుపుకు పనిచేయాలంటే భూమా అనుచరులు ససేమిరా అంటున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశంపార్టీలో అందరి చూపు ప్రస్తుతం అఖిలప్రియ మీదే ఉంది. ఎందుకంటే మంత్రివర్గంలో చేరిన తర్వాత అఖిలప్రియ పూర్తిగా ఇరుక్కుపోయింది. నంద్యాల సీటులో పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అన్న అనుమానం. రాకపోతే ఏం చేయాలో తోచటం లేదు. సంకేతాలు చూస్తుంటే టిక్కెట్టు భూమా కుటుంబానికి వచ్చే అవకాశాలు లేవన్నది వాస్తవం. టిక్కెట్టు నిజంగానే రాకపోతే అప్పుడు ఏం చేయాలి?

ఇక్కడ ఒక ట్వస్ట్ ఉంది. తమ కుటుంబానికి రాకపోయిన సరే బద్ద విరోధి అయిన శిల్పా మోహన్ రెడ్డికి వస్తే ఏం చేయాలి? తమ తండ్రి మరణానికి ఇటీవలే ముగిసిన ఎంఎల్సీ ఎన్నిక కూడా ఒక కారణం. పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపులో భాగంగానే చంద్రబాబునాయుడు భూమా నాగిరెడ్డిపై తీవ్ర ఒత్తిడి పెట్టారన్నది వాస్తవం. దాంతోనే భూమా కుప్పకూలిపోయారనేది భూమా అనుచరుల వాదన, ఆరోపణలు. అటువంటి పరిస్ధితుల్లో మళ్లీ శిల్పా మోహన్ రెడ్డికే టిక్కెట్టు వస్తే ఏం  చేయాలో భూమా అఖిలప్రియతో పాటు వాళ్ల వర్గానికి తోచటం లేదు.

అందుకనే నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తన తండ్రి ఖాళీ చేసిన నంద్యాల అసెంబ్లీ సీటులో తమ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని ప్రకటించిన అఖిల తర్వాత అస్సలు నోరు మెదపటం లేదు. అంతలా చంద్రబాబునాయుడు తాళం వేసేసారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నంద్యాలలో పోటీ చేసే అవకాశం దాదాపు శిల్పా మోహన్ రెడ్డికే దక్కుతుంది. అఖిలకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే కుటుంబానికి ఎంఎల్ఏగా పోటీ చేసే అవకాశం ఇవ్వటం సాధ్యంకాదని చంద్రబాబు అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నియోజకవర్గంలో భూమా కుటుంబానికి బలమైన మద్దతే ఉంది. అందులోనూ శిల్పాకు టిక్కెట్టు ఇస్తే భూమా వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేందు. ఇటువంటి పరిస్ధితుల్లో మళ్ళీ శిల్పా గెలుపుకు పనిచేయాలంటే భూమా అనుచరులు ససేమిరా అంటున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.  మంత్రిగా కూడా ఉన్న అఖిల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు మాటను కాదనలేకపోయినా రేపటి సాధారణ ఎన్నికల సమయంలో నంద్యాల సీటు తెలుగుదేశం పార్టీలో పెద్ద చిచ్చుపెట్టటం  మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu