అధికారంలో ఉండేదుకు జాగ్రత్తలు తీసుకున్నారా?

Published : May 31, 2017, 09:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
అధికారంలో ఉండేదుకు జాగ్రత్తలు తీసుకున్నారా?

సారాంశం

అధికారంలో ఉండటానికి ‘అవసరమైన జాగ్రత్తలు తీసుకోవట’మేంటి? చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తల విషయంపైనే సర్వత్రా చర్చ మొదలైంది.

ఓ మీడియా సంస్ధకు చంద్రబాబునాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూ మీద పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పినా కొన్ని అంశాలపై చర్చ మొదలైంది. చంద్రబాబు మాట్లాడుతూ, ‘టిడిపినే శాశ్వతంగా అదికారంలో ఉండాల’న్నారు. అన్నీ స్ధానాలూ గెలవాలని చెప్పారు. 80 శాతం ప్రజలు తమకే ఓట్లు వేయాలన్నారు.  వేస్తారని అనుకోవటం వేరు, వేయాలని శాసించటం వేరు.

అదే సమయంలో ‘తమ ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుందని అందుకు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా’మని చెప్పారు.  అధికారంలో ఉండాలని కోరుకోవటంలో తప్పేమీలేదు. కానీ అధికారంలో ఉండటానికి ‘అవసరమైన జాగ్రత్తలు తీసుకోవట’మేంటి? చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తల విషయంపైనే సర్వత్రా చర్చ మొదలైంది. అసలే ఇవిఎంల పనితీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో అధికారంలో ఉండేందుకు అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పటంపైనే ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి అప్పుడే.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే