ఆరోగ్య శ్రీ ...ఇక మంగళమేనా

Published : Jan 02, 2017, 01:20 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఆరోగ్య శ్రీ ...ఇక మంగళమేనా

సారాంశం

ఒకే అవసరం కోసం ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేయటం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా ?

సమైక్య రాష్ట్రంలో ఎంతో పాపులరైన ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పథకానికి మంగళం పాడే రోజు దగ్గర పడిందా?  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు బలపడుతున్నాయి. పేదల ఆరోగ్య రక్షణ కోసం సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమది.

 

పథకం అమలులో కొన్ని లోపాలున్న మాట వాస్తవం. పథకం ముసుగులో ప్రభుత్వం కోట్లాది రూపాయలను కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతోందన్న ఆరోపణలు కుడా ఉన్నాయి. లోపాలు, ఆరోపణలు ఎలాగున్నా లక్షలాది మంది నిరుపేదలు లబ్ది పొందిన మాటా వాస్తవమే. 2009లో వైఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చారంటే ఆరోగ్య శ్రీ పథకం కూడా బాగా ఉపయోగపడింది.

 

అయితే, 2009లో హటాత్తుగా వైఎస్ మరణించటంతో పథకానికి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన జరగిన తర్వాత చంద్రబాబు సిఎం కాగానే ఆరోగ్య శ్రీ పథకానికి ప్రత్యామ్నాయంగా ‘ఎన్టిఆర్ హెల్త్ స్కీం’ను ప్రారంభించారు.

 

అప్పటి నుండి ఆరోగ్య శ్రీ పథకం నిర్లక్ష్యానికి గురౌతోందవి. అయితే, ఎన్టీఆర్ హెల్త్ స్కీం కూడా అంత పెద్దగా ప్రజాధరణకు నోచుకోలేదు. ఇంతలో ‘ఆరోగ్య రక్ష’ అంటూ మరో కొత్త పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పేదల ఆరోగ్యం పేరుతో  మరీ ఇన్ని పథకాలా?

 

రాజకీయ పార్టీలన్నాక రాజకీయాలే చేస్తాయి. అందులో సందేహాలు అక్కర్లేదు ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయితే మరింత ఎక్కువ చేస్తుంది. కానీ ప్రజాధరణ పొందిన పథకాల అమల్లో లోపాలుంటే సవరించుకోవాలి. మరింత మెరుగ్గా అమలు చేయాలి. అంతేకానీ ఏకంగా పథకానికే ఎసరు పెట్టకూడదు.

 

ప్రభుత్వ వరస  చూస్తుంటే ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడేందుకే అన్నట్లు కనబడుతోంది.

 

అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పథాకాన్ని రద్దు చేస్తే ప్రజా వ్యతరేకత వస్తుందని యోచించి మెల్లిగా ఆ పథకం ప్రాధాన్యతను తగ్గించారు. అందుకే ముందు ఎన్టీఆర్ హెల్త్ స్కీం అన్నారు. ఇపుడు ఆరోగ్య రక్ష పథకం అంటున్నారు. ఒకే అవసరం కోసం ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేయటం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా ?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?