చంద్రబాబుకు భలే సాకు దొరికింది

Published : Apr 24, 2017, 01:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
చంద్రబాబుకు భలే సాకు దొరికింది

సారాంశం

మోడి నినాదాన్ని సాకుగా చూపించి ఇపుడు రాష్ట్రంలోని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చూడబోతే ఇటువంటి ప్రకటన కోసమే ఇంతకాలం ఎదురుచూస్తున్నట్లుంది ప్రభుత్వం. మోడి నినాదం ఎప్పటికి ఆచరణలోకి వస్తుందో? ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో? మొత్తానికి చంద్రబాబు నెత్తిపై నుండి మోడి పెద్ద భారం దించేసినట్లైంది.

‘వన్ నేషన్-వన్ ఎలక్షన్ అన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలు జరగుతాయం’టూ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తేల్చి చెప్పేసారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయించేందుకు చంద్రబాబునాయుడుకు భలే సాకు దొరికింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపాలక సంస్ధలకు కలిపి మొత్తం 11 చోట్ల ఎన్నికల జరగాల్సి ఉంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.

పోయిన ఏడాది నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినా ఏవో సాకులు చూపిస్తూ ఎన్నకల నిర్వహణను చంద్రబాబు సర్కార్ వాయిదా వేయిస్తోంది. ఎన్నికలంటూ నిర్వహిస్తే ఫలితాలు ఎలాగుంటాయో అన్న అనుమానంతోనే వాయిదా మంత్రాన్ని టిడిపి పఠిస్తోందన్నది వాస్తవం. ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లలో తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, విశాకపట్నం, కాకినాడ ఉన్నాయి. పై కార్పొరేషన్లలోని ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయిస్తున్నట్లు టిడిపిలోనే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

అంటే ఎన్నికలు నిర్వహిస్తే మెజారిటీ చోట్ల ఓటమిఖాయమని అనుకుంటున్నది అధికార పార్టీ. దాంతో ఓటర్ల జాబితాలో సవరణలని ఒకసారి, వార్డుల్లో రిజర్వేషన్ల పేరుతో ఇంకోసారి వాయిదా  వేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఒన్ నేషన్-ఒన్ ఎలక్షన్ నినాదం చంద్రబాబుకు బాగా అచ్చొచ్చింది. మోడి నినాదాన్ని సాకుగా చూపించి ఇపుడు రాష్ట్రంలోని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చూడబోతే ఇటువంటి ప్రకటన కోసమే ఇంతకాలం ఎదురుచూస్తున్నట్లుంది ప్రభుత్వం. మోడి నినాదం ఎప్పటికి ఆచరణలోకి వస్తుందో? ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో? మొత్తానికి చంద్రబాబు నెత్తిపై నుండి మోడి పెద్ద భారం దించేసినట్లైంది.

PREV
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu