కడప జిల్లాలో పిడకల వేట...

First Published Jan 11, 2017, 1:32 PM IST
Highlights

 ఈ మధ్య ముఖ్యమంత్రి  నాయుడు సభలలో పూజారి మంత్రాల  కంటే  దివాకర్ రెడ్డి తిట్లకు ప్రాముఖ్యం లభిస్తూ ఉంది.

 

ఈరోజు గండికోట రిజర్వాయర్ నుంచి కృష్ణానీళ్లను లిఫ్ట్ చేసేందుకు ఉద్దేశించినఎత్తి పోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన సభలో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి పిడకల వేట ప్రారంభించారు.

 

అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా సంతోషాన్ని చ్చింది. 

 

రాష్ట్రంలోనే ప్రస్తుతం సీనియర్ నాయకుడయిన దివాకర్ రెడ్డి ఆ వేదిక మీది నుంచి చేసింది,  ప్రతిపక్ష నాయకుడు జగన్ ని, వైసిపి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ని తిట్టడమే. తిట్టే స్వేచ్ఛ ఉంది. కాని, అది వేదిక కాదేమో.

 ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలలో పూజారి కంటే  దివాకర్ రెడ్డి తిట్లకు ప్రాముఖ్యం లభిస్తూ ఉంది. విధిగా ఆయన తిట్ల  కార్యక్రమం ఏర్పాటవుతూ ఉంది. విజయవాడ కావచ్చు, ముచ్చు మర్రి కావచ్చు, ఇపుడు గండికోట ప్రాజక్టు  కావచ్చు. దివాకర్ రెడ్డి పాత్ర లేకపోయినా, కల్పించి, మైకిచ్చి దుమ్మెత్తి పోయించడం –దాన్నంతా ముఖ్యమంత్రి  చిద్విలాసంతో తిలకించడం రివాజయింది.

 

ఈ రోజు గతంలో శ్రీకాంత్ రెడ్డి చేసిన విమర్శలకు జవాబిచ్చేందుకు గండికోట్ సభనివాడుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి విమర్శలు, ముచ్చు మర్రిలో దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటరే.

 

తనకు మద్య పానం అలవాటు లేదని అందువల్ల శ్రీకాం త్ రెడ్డి అన్నట్లు జానీ వాకర్ రెడ్డి కాదని అన్నారు. అంతేకాదు, తన నాలుక చీరేస్తానంటే, వాళ్లఇంటికొస్తానని అనికూడాచెప్పారు. జగన్ కి వైఎస్ బుద్దులు రాకుండదా తాత బుద్దులొచ్చాయని చెప్పారు.

 

చంద్ర‌బాబు స‌మక్షంలోనే  జేసీ నిప్పులు చెరిగారు. 'బూట్లు నాకే వ్యక్తి అని మండిప‌డ్డారు..మా ఇంట..వంట..సారాయి తాగే అలవాటు లేదు అని అన్నాడు..నాలుక చీరుస్తావా..అంత మొగడివా..నీ ఇంటికి వస్తా..పులివెందులకు వస్తా' అంటూ హుంకరించారు.బూట్లు నాకేవాడినైతే.. ఎప్పుడో మంత్రి అయ్యేవాడినన్నారు. ఏడో తరగతి ఫెయిల్‌ అయినవారిని వైకాపా తాడిపత్రి ఇన్‌ఛార్జిగా పెట్టారని తీవ్రంగా ఆరోపించారు. ఎంతచేసినా చంద్రబాబు నాయుడు దివాకర్ రెడ్డిని తన సన్నిహితుడిగా చూడలేకపోతున్నారు.

 

కులం, వర్గంతో పెట్టుకుంటే లాభం ఉండదని చెప్పారు. చివరకు  ఏం జరిగింది, శ్రీకాంత్ రెడ్డి గతంలో తిట్టిన తిట్లన్నీ మళ్లీ తిట్టాడు.

 

click me!