
విజయవాడలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో చర్చించారు.
అంతర్జాతీయ స్థాయిలో కృష్ణా నది తీరాన్ని పర్యాటకులను అకట్టుకునే విధంగా తీర్చి దిద్దాలని సూచలనిచ్చారు. ఇక్కడి చిత్రాలన్ని ఈ అభివృద్దికి సంబంధించిననమూనాలు.
విజయవాడలో రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సమావేశం చివరలో కన్సల్టెంట్లు ఒక ప్రెజెంటేషన్ అందించారు. దుర్గ గుడి, నది తీరంలోని ఘాట్లు, నది చెంతనే వున్న కాల్వలు, బస్ పోర్ట్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలన్నింటిని అతి పెద్ద వాణిజ్య, వినోదసముదాయంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికను వివరించారు. మిక్స్ డెవలప్‌మెంట్ అప్రోచ్ పేరుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో రివర్, కెనాల్ ఫ్రంట్ ప్రాంతాలను అభివృద్ది చేస్తారు.
ఈ సముదాయంలో బిజినెస్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, సర్విస్ అపార్టుమెంట్లు, మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్టులు, సెంట్రల్ పార్క్, గ్రీనరీ, పై వంతెనలు, సైకిల్ ట్రాకులు వుంటాయి. అలాగే, అంతర్గత జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తారు. మరిన్ని అంశాలు జోడించి మరింత ఆకర్షణీయంగా వుండేలా ఈ ప్రణాళికను మెరుగుపరచి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.