చమన్ రాజీనామాకు ఆదేశించిన చంద్రబాబు

First Published Jun 17, 2017, 6:42 PM IST
Highlights

చమన్, గంగన్న తదితరులతో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ రాజీనామాలు చేయాలని స్పష్టం చేసారు. కొత్త జడ్పీ ఛైర్మన్ గా కోలా నాగరాజును నియమిస్తున్నట్లు చంద్రబాబు సమీక్షలోనే ప్రకటించారు. గడువు ముగిసిన వారందరూ తమ పదవులకు తక్షణం రాజీనామాలు చేయాల్సిందేనంటూ తెగేసి చెప్పారు.

అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్ను వెంటనే రాజీనామా చేయాల్సిందిగా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయనతో పాటు పుటపర్తి మున్సిపల్ ఛైర్మన్ పిసి గంగన్నను కూడా రాజీనామ చేయమని చంద్రబాబు చెప్పారు. జిల్లా సమస్యలు, పదవులు, నేతలమధ్య సమన్వయంపై ఈరోజు సిఎం నివాసంలో సుదీర్ఘంగా సమీక్ష జరిగింది.

గతంలో జరిగిన ఒప్పందాల ప్రకారం అదికారిక పదవులు పొందిన వారు రెండున్నర సంవత్సరాల పదవీ కాలం అయిపోగానే రాజీనామా చేయాలి. అయితే అప్పట్లో పదవులు పొందిన వారు ఇపుడు రాజీనామాలు చేయటానికి అంగీకరించటం లేదు. పుటపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్నను మంత్రులు రాజీనామా చేయమంటే ఎదురు తిరిగారు. జడ్పీ ఛైర్మన్ గా రాజీనామా చేయాల్సిన చమన్ కూడా కుదరదని చెబుతున్నారు. చమన్ మంత్రి పరిటాల సునీత మద్దతుదారుడన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇలా ఎవరికి వారు తమకున్న అండతో పదవులకు రాజీనామాలు చేయటానికి ఇష్టపడకపోవటం చంద్రబాబుకు పెద్ద సమస్యగా తయారైంది. రెండేళ్ళల్లో వస్తున్న ఎన్నకల్లో పార్టీకి నేతలు పనిచేయాలంటే మరికొందరికి పదవులు ఇస్తేనే పనిచేస్తారు. అందులోనూ తమకు పదవులు ఎప్పుడిస్తారంటూ చంద్రబాబును అడుగుతూనే ఉన్నారు. దాంతో చంద్రబాబు వద్ద అటువంటి పంచాయితీనే జరిగింది ఈరోజు.

చమన్, గంగన్న తదితరులతో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ రాజీనామాలు చేయాలని స్పష్టం చేసారు. కొత్త జడ్పీ ఛైర్మన్ గా కోలా నాగరాజును నియమిస్తున్నట్లు చంద్రబాబు సమీక్షలోనే ప్రకటించారు. గడువు ముగిసిన వారందరూ తమ పదవులకు తక్షణం రాజీనామాలు చేయాల్సిందేనంటూ తెగేసి చెప్పారు. ఎందుకంటే, ఇదేవిధమైన సమస్య చాలా జిల్లాల్లో ఉంది. రాజీనామాలు చేసిన నేతలందరూ ఏం చేస్తారో చూడాలి. సరే,. పార్టీని పట్టి కుదిపేస్తున్న జెసి దివాకర్ రెడ్డి వ్యవహారంపైన కూడా కొంత చర్చ జరిగింది.

click me!