జగన్ నైజాన్ని వర్ణించిన చంద్రబాబు

Published : May 16, 2017, 10:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
జగన్ నైజాన్ని వర్ణించిన చంద్రబాబు

సారాంశం

నిజంగా చంద్రబాబు చెప్పిందే నిజమైతే చాలా మంది రాజకీయ నేతల తీరు ఇదే విధంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైజాన్ని చంద్రబాబునాయుడు వివరించారు. ‘అందితే జుట్టు అందకపోతే కాళ్ల’ టైపట జగన్. ఈరోజు అమరావతిలో టిడిఎల్పీ సమావేశం జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘సోనియాగాంధితో పోరాటం అని చెప్పి కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్నారు’. ‘ప్రత్యేకహోదా కోసం జూన్ లో ఎంపిలతో రాజీనామాలు చేయిస్తామని గతంలో ప్రకటించి ఇపుడు ప్రధానమంత్రి నరేంద్రమోడి కాళ్లు పట్టుకున్న’ట్లు వ్యాఖ్యానించారు. జగన్ తీరును జనం అర్ధం చేసుకుంటున్నట్లు కూడా చంద్రబాబు చెప్పారండోయ్. నిజంగా చంద్రబాబు చెప్పిందే నిజమైతే చాలా మంది రాజకీయ నేతల తీరు ఇదే విధంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంతెందుకు, చంద్రబాబు తీరు మాత్రం అందుకు ఏమన్నా భిన్నంగా ఉందా? మీరే చెప్పండి

PREV
click me!

Recommended Stories

Dasara Holidays 2026 : దసరా హాలిడేస్ అక్టోబర్ 25 వరకు పొడిగిస్తారా? 13 కాదు 16 రోజులు సెలవులేనా?
Vallabhaneni Vamsi పై తీవ్రంగా కంట్రోల్ తప్పిన Yarlagadda Venkatrao | Local Body Elections | Asianet