
పాపం గొట్టిపాటి రవికుమార్. చంద్రబాబునాయుడు గొట్టిపాటికి గట్టి షాకే ఇచ్చారు. ఈరోజు ఉదయం ఒంగోలులో కరణం బలరాం-గొట్టిపాటికి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది కదా? ఆ విషయమై కరణంపై ఫిర్యాదు చేసేందుకు గొట్టిపాటి విజయవాడకు వచ్చారు. అయితే, సిఎం అపాయిట్మెంట్ సాధ్యం కాదని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు స్పష్టం చేసారట. అయితే, ఉదయమే సిఎం అపాయింట్మెట్ తీసుకున్నా, సాయంత్రం విజయవాడకు వచ్చిన తర్వాత కుదరదని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఉదయం కరణంకు గొట్టిపాటికి జరిగిన ఘర్షణలో గొట్టిపాటి చొక్కా చింపేసి, కిందపడేసి కరణం కొట్టారు. అప్పటి నుండి గొట్టిపాటి రగిలిపోతున్నారు.
సిఎంను కలవటం సాధ్యం కాదని చెప్పటంతో ఏం చేయాలో గొట్టిపాటికి అర్ధం కావటం లేదు. అందుకే బుధవారం ఉదయమన్నా అపాయిట్మెంట్ ఇప్పించమని అడిగారు. అయితే, బుధవారం ఉదయమే చంద్రబాబు హైదరాబాద్ కు బయలుదేరుతారు. హైదరాబాద్ లో జరిగే మినీమహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. అదే విషయాన్ని సిఎంవో అధికారులు గొట్టిపాటికి స్పష్టం చేసారట. దాంతో తను కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడే కలవాలని అనుకున్నారట. అయితే, అక్కడ కూడా సాధ్యం కాదని అధికారులు చెప్పారట.
పార్టీలో చేరేటపుడు, చేరిన కొత్తలో అద్దంకి నియోజకవర్గంలో మొత్తం నీవే అని చంద్రబాబు చెప్పటంతో గొట్టిపాటి ఇక తనకు తిరుగేలేదనుకున్నారు. కానీ పార్టీలో చేరిన తర్వాత చూస్తే అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయ్. దాంతో ఏం చేయాలో అర్ధంకాక అవస్తులు పడుతున్నారు. వైసీపీ నుండి ఫిరాయించిన చాలా మంది ఎంఎల్ఏల పరిస్ధితి ఇదే విధంగా ఉందిలేండి. దాంతో టిడిపిలో ఇమడలేక తిరిగి వైసీపీలోకి వెళ్ళలేక అవస్తలు పడుతున్నారు.