
సైన్స్ విద్యార్ధులకు చంద్రబాబునాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏపి శాస్త్రవేత్తల్లో ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే రూ. 100 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తానంటూ ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు సిఎం హాజరయ్యారు.
బుధవారం నాటి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు రూ. 100 కోట్ల ప్రైజ్ మని ప్రకటించారు.
విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ రూ. 100 కోట్ల ప్రైజ్ మనీ కోసమైనా విద్యార్ధులు ఈరోజు నుండి నోబెల్ బహుమతి కోసం కష్టపడాలంటూ చమత్కరించారు. దేశానికి యువశాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.
తన ప్రకటనను దృష్టిలో పెట్టుకుని యువశాస్త్రవేత్తలు పరిశోధనల్లో పోటీపడాలని చెప్పారు.