ఓట్లేసిన ప్రముఖులు

Published : Jul 17, 2017, 02:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఓట్లేసిన ప్రముఖులు

సారాంశం

తొలి ఓటును చంద్రబాబు, రెండో ఓటును కోడెల శివప్రసాదరావు వినియోగించుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఓటేసారు. ఇక మిగిలిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా ఓట్లేసారు లేండి.

రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి, కోడెల శివప్రసాదరావు లాంటి ప్రముఖులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. తొలి ఓటును చంద్రబాబు, రెండో ఓటును కోడెల శివప్రసాదరావు వినియోగించుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఓటేసారు.

సరే, ఇక మిగిలిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా ఓట్లేసారు లేండి. ఇటు టిడిపి అయినా, అటు వైసీపీ అయినా ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా ముందుజాగ్రత్తగా మాక్ ఓగింగ్ నిర్వహించాయి లేంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ కు అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఎంఎల్ఏలను మాత్రం చంద్రబాబు సమాయానికి రప్పించ లేకపోయారు. దాంతో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో ఆయా జిల్లాల మంత్రులు ఉరుకులు పరుగుల మీద తమ ఎంఎల్ఏలందరూ ఓటింగ్ కు హాజరయ్యిందీ లేందీ లెక్కలు చూసుకోవటంలో ముణిగిపోయారు.

 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu