ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

Published : Jul 17, 2017, 01:30 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల్లో న్యూఢిల్లీకి వెళ్ళటానికి జెసి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. రెగ్యులర్ విమానల్లో జెసి ప్రయాణంపై విమానయాన సంస్ధలు నిషేధం విధించాయి కదా?  ఏం చేయాలో తోచని జెసి టిడిపికి సంబంధం ఉన్న వాళ్లలో ఎవరిదో ప్రత్యేక విమానాన్ని తెప్పించుకున్నారు. దానిలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు.

పాపం అనంతపురం టిడిపి ఎంపి జెసి దివారకర్ రెడ్డికి ఎంత కష్టమొచ్చిందో. రాష్ట్రపతి ఎన్నికల్లో న్యూఢిల్లీకి వెళ్ళటానికి జెసి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. రెగ్యులర్ విమానల్లో జెసి ప్రయాణం చేయటాన్ని విమానయాన సంస్ధలు నిషేధం విధించాయి కదా? ఏం చేస్తారు మరి. ఆమధ్య విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమాన సిబ్బందిపై జెసి వీరంగ వేసిన సంగతి గుర్తుంది కదా? అప్పటి నుండి దేశీయ విమానసంస్ధలన్నీ ఎంపి విమానాల్లో ప్రయాణం చేయటాన్ని నిషేధించాయి.

అధికార పార్టీ ఎంపి హోదాలో జెసి ఎంత ప్రయత్నించినా విమాన సంస్ధలు తమ పట్టు వదల్లేదు. అయినా విమాన సిబ్బందికి క్షమాపణలు చెప్పకుంటే సరిపోయేదానికి జెసి పట్టుదలకు పోతున్నారు. ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని పరిష్కరించుకోమని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పినా జెసి ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా వివాదంలో తన తప్పేమీ లేదంటూ విమానసంస్ధలపై  జెసి కోర్టులో కేసు కూడా వేసారు.

అయినా విమాన సంస్ధలు ఏమాత్రం భయపడలేదు. ఇంతలో రాష్ట్రపతి ఎన్నిక ముంచుకొచ్చింది. అందరూ ఎంపిలు మామూలు విమానాల్లోనే వెళ్ళారు. కానీ జెసికే పెద్ద చిక్కొచ్చిపడింది. దాంతో ఏం చేయాలో తోచని జెసి టిడిపికి సంబంధం ఉన్న వాళ్లలో ఎవరిదో ప్రత్యేక విమానాన్ని తెప్పించుకున్నారు. దానిలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు. సరే, వెళ్లటం వరకూ ఓకే. మరి తిరిగి రావటం ఎలా? అది కూడా ప్రత్యేక విమానమే అనుకుందాం? ఇలా ఎన్ని రోజులు? చూద్దాం జెసి ఎంతకాలం ఇలా ప్రత్యేక విమానాల్లో నెట్టుకొస్తారో?

పనిలో పనిగా తనపై విధించిన ట్రావెల్ బ్యాన్ అంశాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని కూడా జెసి ప్రయత్నిస్తున్నారట. విచిత్రం కాకపోతే కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజే టిడిపి ఎంపి కదా? కానీ ఆయన వద్దకు వెళ్ళలేరు. ఎందుకంటే తన ట్రావెల్ బ్యాన్ వివాదంలో రాజుగారిని కూడా జెసి బాగానే ఇరికించేసారు లేండి. అందుకనే రాజుగారి దగ్గరకు వెళ్లేందుకు ఎంపికి మొహం చెల్లక జైట్లీతో మాట్లాడుతారట.

PREV
click me!

Recommended Stories

Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu