నిజం ఒప్పుకున్న చంద్రన్న

Published : Jun 03, 2017, 08:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నిజం ఒప్పుకున్న చంద్రన్న

సారాంశం

సదస్సుల్లో కుదుర్చుకున్న ఎంఓయులు అన్నీ పెట్టుబడులుగా రాకపోవచ్చంటూ సన్నాయినొక్కులు నొక్కారు. నిజమే, అన్నీ రాకపోవచ్చు. కానీ,  ఎంత వచ్చాయో చెప్పాలి కదా?

‘రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇటీవల కుదుర్చుకున్న రూ. 17 లక్షల కోట్ల విలువైన ఎంఓయుల్లో అన్నీ రాకపోవచ్చు’. ‘వచ్చిన వాటితోనే రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాను’....ఇది నవనిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబునాయుడు బెంజిసర్కిల్లో చెప్పిన మాటలు. రెండేళ్ళు విశాఖపట్నంలో జరిపిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు పెద్దగా రాలేదన్న విషయాన్ని చంద్రన్న అంగీకరించినట్లైంది. అప్పట్లో సదస్సు వల్ల లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినట్లే ఊదరగొట్టారు.

మొదటిసారి నిర్వహించిన సదస్సులో ఖర్చు దండగ తప్ప ప్రయోజనం లేకపోయింది. అప్పట్లో సదస్సు నిర్వహణ కోసం చేసిన ఖర్చు రూ. 25 కోట్లు. ఎంఓయుల్లో కుదుర్చుకున్న రూ. 4.5 లక్షల కోట్లు అదిగో వచ్చేస్తోంది, ఇదిగో వచ్చేస్తోందంటూ చాలాకాలం ఊరించారు. చంద్రబాబబు అనుకూల మీడియా కూడా రాష్ట్రానికి లక్షల కోట్లంటూ జనాలను తప్పదోవ పట్టించాయి.

ఇక, రెండోసారి నిర్వహించిన సదస్సులో ఏకంగా రూ. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులంటూ పాత పాటే మొదలుపెట్టారు. మొదటిసారి నిర్వహించిన సదస్సులో కోటి రూపాయలు కూడా పెట్టుబడిగా రాలేదంటూ పరిశ్రమల శాఖే సమాచర హక్కుచట్టం ద్వారా తెలిపింది. ఇక రెండో సదస్సులో ఏ మేరకు పెట్టుబడులు వచ్చిందీ ప్రభుత్వం చెప్పలేదు. ఒకవేళ ఏమైనా వచ్చివుంటే ప్రచారంతో అదరగొట్టేసేదే, కాబట్టి ఏమీ రాలేదనే అర్ధం చేసుకోవాలి.

శుక్రవారం జరిగిన నవనిర్మాణదీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ, సదస్సుల్లో కుదుర్చుకున్న ఎంఓయులు అన్నీ పెట్టుబడులుగా రాకపోవచ్చంటూ సన్నాయినొక్కులు నొక్కారు. నిజమే, అన్నీ రాకపోవచ్చు. కానీ,  ఎంత వచ్చాయో చెప్పాలి కదా? విజయవాడలో సదస్సు నిర్వహించటమే కాకుండా విదేశాలకు కూడా పెట్టుబడుల కోసం చాలాసార్లు తిరిగొచ్చారు. అక్కడి నుండి ఏం వచ్చింది కూడా చెప్పలేదు. అంటే విదేశీ పర్యటనల ఖర్చు కూడా వేస్టే. చంద్రన్న పాలన మొత్తం ప్రచారార్భాటం తప్ప ఇంకేమీ లేదన్న విషయం అర్ధమైపోతోంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే