ఆయన ప్యాంట్రీ వెహికిల్ ఖర్చు 31 లక్షలు

First Published Nov 9, 2016, 11:07 AM IST
Highlights

అత్యంత భద్రత మధ్య పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రు. 31 లక్షల వ్యయంతో భద్రంగా ప్యాంట్రీ వెహికిల్ తయారయింది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇపుడు వరల్డ్ క్లాస్ సంచార వంటశాల అందించారు. ఇంతవరకు ముఖ్యమంత్రి హైదరాబాద్  కార్యాలయం, లేక్ వ్యూగెస్ట్ హౌస్, ఆయన అద్దెకుండిన ఇళ్లు, ఉండవళ్లి విల్లా గురించి విన్నాం. ఈ మధ్యలో ఆయన జిల్లాలలో పర్యటించేందుకు సేకరించిన బుల్లెట్ ఫ్రూఫ్ బస్ గురించి చదివాం. ఇపుడు మొదటి సారి ముఖ్యమంత్రి కి సమకూర్చిన హైటెక్ ప్యాంట్రీ వెహికిల్ (సంచాల వంటశాల) గురించిన సమాచారం  బయటకు పొక్కింది.

 

 ఎపుడో 2015 లోనే అయిదున్నర కోట్లతో హెటెక్ బస్సు సమకూర్చుకున్నా,  తిండికి  మాత్రం పాత ప్యాంట్రీవాహనం మీద అధార పడుతూ వచ్చారు. ఈ రెండు మ్యాచ్ కాకపోవడం వల్ల , బస్సుకు తగ్గ  వంటశాల వాహనం ఉంటే బాగుటుందని భావించిన సిఎంఒ అధికారులు ఆర్టీసి సహకారంతో ఈ సంచార వంటశాలను సిద్ధం చేశారు. అత్యంత భద్రత మధ్య పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రు. 31 లక్షల వ్యయంతో భద్రంగా ఈ  వంటశాల వాహనం తయారయింది. పర్యటనలలో  ముఖ్యమంత్రి భద్రతను,ఆహారపు అవసరాలను దృష్టిలో పట్టుకుని ప్రత్యేకంగా ఈ వాహనాన్ని డిజైన్ చేశారు.

 

ఈ మధ్య పెరిగిన భద్రతను దృష్టిలో పెట్టుకుని ఒక వాహనాన్ని సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎపిఎస్ ఆర్టీసిని కోరింది. ఈ ప్యాంట్రీ వాహనంలో మోడ్యలార్ కిచెన్, హబ్, చిమ్నీ, గీజర్, డిష్ వాషర్, రిఫ్రెజిరేటర్, జనరేటర్ వుంటాయి. వీటన్నింటిని ఫ్యాబ్రికేట్ చేసేందుకు రు. 30,94, 398 ఖర్చయ్యాయి. ఇంతకు ముందు ముఖ్యమంత్రికి రు. 5.6 కోట్లతో ఒక బుల్లెట్ ఫ్రూహ్ వాహనం కొన్నారు. ఇపుడు ఆయన వెంబడి పర్యటనలో ఉంటూ అవసరమయినపుడు కోరిన ఆహారం సమకూర్చేందుకు ఈ  ప్యాంట్రీ వాహనం రూపొందించారు. ఆర్టీసి అధికారులు,  పాత ప్యాంట్రీ వాహనం తనిఖీ తీసేసి, దాని స్థానంలో కొత్త హంగులతో వరల్డ్ క్లాస్ ప్యాంట్రీ వాహనం తయారుచేసి ఇచ్చారు. అయితే, భారం అర్టీసి మీద వేయలేదు. ప్రభుత్వమే  బిల్లు చెల్లించింది. అనుమానం ఉన్నవాళ్లు జివొ లువ  తనిఖీ చేసుకోవచ్చు.

click me!