బెజవాడ టీడీపీలో లొల్లి: నాగుల్‌మీరా, బుద్దా వెంకన్నలకు బాబు పిలుపు

Published : Feb 22, 2021, 03:07 PM IST
బెజవాడ టీడీపీలో లొల్లి: నాగుల్‌మీరా, బుద్దా వెంకన్నలకు బాబు పిలుపు

సారాంశం

విజయవాడకు చెందిన టీడీపీ నేతల మధ్య చోటు చేసుకొన్న అభిప్రాయ బేధాలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కేంద్రీకరించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరాలను రావాలని చంద్రబాబునాయుడు ఆహ్వానించారు.


విజయవాడ: విజయవాడకు చెందిన టీడీపీ నేతల మధ్య చోటు చేసుకొన్న అభిప్రాయ బేధాలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కేంద్రీకరించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరాలను రావాలని చంద్రబాబునాయుడు ఆహ్వానించారు.

కార్పోరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత  నాగుల్ మీరాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ వర్గానికి ఎంపీ కేశినేని నాని వర్గానికి మధ్య కూడ పరస్పప విమర్శలు సాగుతున్నాయి.

also read:రంగంలోకి బాబు: కేశినేనికి ఫోన్, బెజవాడ టీడీపీ నేతల మధ్య గొడవపై సీరియస్

ఈ విషయమై టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా ఉంది. ఈ పరిణామాలపై నేతలతో చర్చించాలని చంద్రబాబునాయుడు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడుకు సూచించారు. 

చంద్రబాబు సూచన మేరకు అచ్చెన్నాయుడు ఆదివారం నాడు  నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలతో చర్చించారు. ఈ చర్చల సారాంశాన్ని అచ్చెన్నాయుడు  చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు.

దీంతో నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలను పార్టీ సెంట్రల్ కార్యాలయానికి రావాలని చంద్రబాబు సమాచారం పంపారు. ఈ సమాచారం అందిన వెంటనే బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు సోమవారం నాడు మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకొన్నారు.

39వ డివిజన్ లో పార్టీ అభ్యర్ధి విషయమై నేతల మధ్య చోటు చేసుకొన్న అభిప్రాయబేధాలపై చంద్రబాబునాయుడు చర్చించే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu