కుప్పంలో జగన్ చంద్రబాబుకు చుక్కలు చూపించారు: కొడాలి నాని

Published : Feb 22, 2021, 02:51 PM IST
కుప్పంలో జగన్ చంద్రబాబుకు చుక్కలు చూపించారు: కొడాలి నాని

సారాంశం

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని ఆయన టిడీపీ తమ్ముళ్లకు సలహా ఇచ్చారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్ికల్లో టీడీపీకి 42 శాతం గెలుపు ఎక్కడ వచ్చిందో చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. 

పిచ్చెక్కి చంద్రబాబు మాట్లాడుతున్నారని, గెలిచిన 42 శాతం అభ్యర్థులు ఎవరో చంద్రబాబు ప్రకటించాలని ఆయన అన్నారు. చంద్రబాబును టీడీపీ నేతలు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పంపించడం ఖాయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

తమ నాయకుడు వైఎస్ జగన్ చంద్రబాబుకు కుప్పంలో కూడా చుక్కలు చూపించారని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు కుప్పంలోనే 75 స్తానాలు గెలిస్తే చంద్రబాబు ఎక్కడ 42 శాతం గెలిచినట్లని ఆయన అడిగారు. చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని సూచించారు. జూమ్ యాప్ ల్లో చంద్రబాబు కూర్చుని పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబు పిచ్చితో తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేసుకున్నారని, ఇప్పటికైనా చంద్రబాబును టీడీపీ తమ్ముళ్లు పిచ్చాస్పత్రిలో చేర్పించాలని కొడాలి నాని అన్ారు. లేదంటే ఏపీలో కూడా టీడీపీ భూస్థాపితం అవుతుందని అన్నారు. గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన అన్నారు. 

ఇక పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు తామే కైవసం చేసుకుంటామని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu