దారుణం:ఇద్దరు భార్యలతో కలిసి ఉంటానని... కత్తితో పొడిచాడు

Published : Mar 30, 2020, 01:06 PM ISTUpdated : Mar 30, 2020, 01:11 PM IST
దారుణం:ఇద్దరు భార్యలతో కలిసి ఉంటానని... కత్తితో పొడిచాడు

సారాంశం

ద్దరు భార్యలను ఒకే ఇంటికి రమ్మన్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కలిసి ఉందామని చెప్పాడు. ఈ మాటలను నమ్మిన భార్యలు ఒకే ఇంటికి చేరాడు. మద్యం మత్తులో ఓ భార్యపై  కత్తితో దాడి చేశాడు. 

విశాఖపట్టణం: ఇద్దరు భార్యలను ఒకే ఇంటికి రమ్మన్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కలిసి ఉందామని చెప్పాడు. ఈ మాటలను నమ్మిన భార్యలు ఒకే ఇంటికి చేరాడు. మద్యం మత్తులో ఓ భార్యపై  కత్తితో దాడి చేశాడు. 

తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటు చేసుకొంది.విశాఖపట్టణం జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని గూడం కాలనీకి చెందిన నాగరాజుకు లక్ష్మి, సుశీల అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.

వీరిద్దరూ కూడ ఇదే గ్రామంలో వేర్వేరు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో నాగరాజు అందరం ఒకే దగ్గర ఉండాలని భావించాడు. ఈ మేరకు ఇద్దరు భార్యలను ఒప్పించాడు.

వేర్వేరు ఇళ్లలో ఉండడం కంటే  ఒకే ఇంట్లో ఉండాలని భార్యలకు నచ్చజెప్పాడు. దీంతో వారిద్దరూ కూడ ఒప్పుకొన్నారు. అందరూ కలిసి భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని భార్యలకు సూచించాడు.

ఈ మేరకు ఆదివారం నాడు నాటు కోడి కూర వండాలని భార్యలకు చెప్పాడు. కోడిని కోసి భార్యలకు వంటను సిద్దం చేయాలని చెప్పి బయటకు వెళ్లాడు. నాగరాజు ఇంటికి వచ్చేలోపుగానే. భార్యలు వంట చేశారు.. బయట నుండి ఇంటికి వచ్చిన నాగరాజు మద్యం తాగాడు. మద్యం తాగేందుకే బయటకు వెళ్లినట్టుగా భార్యలు అనుమానించారు. 

Also read:భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం: అల్లరి చేస్తున్నాడని కొడుకును చంపిన లవర్

అందరం కలిసి ఉండాలని చెప్పి మద్యం తాగి ఎందుకు వచ్చావని ఇద్దరు భార్యలు నిలదీశారు. మద్యం తాగితే తాము ఊరుకోబోమని భార్యలు తెగేసి చెప్పారు. ఈ మాటలకు నాగరాజుకు  కోపం కట్టలు తెంచుకొంది.

నాటు కోడిని కోసిన కత్తిని మొదటి భార్య లక్ష్మిపై విసిరివేశాడు. దీంతో ఆమె తలకు కత్తి తగిలి తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu