ఏలూరుకి చేరుకున్న డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ భవానీ: కూరగాయలను పరీక్షకు పంపిన అధికారులు

By narsimha lodeFirst Published Dec 7, 2020, 8:49 PM IST
Highlights

ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన డాక్టర్ భవానీ సోమవారం నాడు రాత్రి ఏలూరుకు చేరుకొన్నారు. వింత వ్యాధితో సుమారు 451 మంది ఈ వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే.

ఏలూరు: ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన డాక్టర్ భవానీ సోమవారం నాడు రాత్రి ఏలూరుకు చేరుకొన్నారు. వింత వ్యాధితో సుమారు 451 మంది ఈ వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే.

ఈ వ్యాధికి గల కారణాలపై డాక్టర్ భవానీ ఆరా తీయనున్నారు. రోగులను పరీక్షించనున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన రోగుల నివేదికల ఆధారంగా  చికిత్స అందించనున్నారు. వింత వ్యాధిపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని  ఏలూరులో సోమవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

also read:ఏలూరులో వింత వ్యాధి: 451కి చేరిన బాధితులు

కేసుల వివరాలపై పేషెంట్స్ లక్షణాలు, నివేదికలపై సమీక్షించారు. పాలు,. నీళ్ల రిపోర్టుల్లో ఎలాంటి పొరపాట్లు లేవని తేలింది.దీంతో కూరగాయలను పరీక్షలకు పంపాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఏలూరు ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఏలూరు పట్టణంలో ఫాగింగ్ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు ఆళ్లనాని.

ఆసుప్రతికి వస్తున్నవారు ఫిట్స్ తో వస్తున్నారా లేదా అనేది నిర్ధారించాలని ఆయన వైద్యులను కోరారు. శనివారం నుండి ఈ వ్యాధితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇంతవరకు వ్యాధికి గల కారణాలు తెలియలేదు. దీంతో వైద్య నిపుణులు రంగంలోకి దిగారు.కేంద్రం నుండి కూడ నిపుణుల బృందం ఏలూరుకు రానున్నారు. ముగ్గురు సభ్యుల బృందం ఏలూరుకు పంపింది కేంద్ర ఆరోగ్య శాఖ.


 

click me!