ఏలూరులో వింత వ్యాధి: 451కి చేరిన బాధితులు

By narsimha lodeFirst Published Dec 7, 2020, 8:11 PM IST
Highlights

వింత వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య 451 కి చేరింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. గంట గంటకు రోగుల సంఖ్య పెరిగిపోతోంది.

ఏలూరు: వింత వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య 451 కి చేరింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. గంట గంటకు రోగుల సంఖ్య పెరిగిపోతోంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 169కి చేరుకొంది. ఇప్పటికే 263 మందిని డిశ్చార్జ్ చేశారు.చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 17 మంది బాధితులను మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

శనివారం నుండి వింత వ్యాధి ప్రారంభమైంది.సోమవారం నాడు బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆదివారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. 

also read:

ఈ వ్యాధికి గల కారణాలను ఇంతవరకు వైద్యులు నిర్ధారించలేకపోయారు. కేంద్రం నుండి ముగ్గురు సభ్యుల బృందం కూడ ఏలూరుకు రానుంది. రేపు మధ్యాహ్నానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని  కేంద్ర ప్రభుత్వం నిపుణులను ఆదేశించింది.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ వైద్యులను ఆదేశించారు.

 

click me!