ఆ క్వారీలను ఉమానే ప్రారంభించారు.. ఇప్పుడు నాపై నిందలా: మైనింగ్ వివాదంపై కృష్ణప్రసాద్ స్పందన

By Siva KodatiFirst Published Jul 29, 2021, 5:50 PM IST
Highlights

మాజీ మంత్రి దేవినేని ఉమ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. కేఈ కృష్ణమూర్తే స్వయంగా క్వారీ అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి హోదాలో దేవినేని స్వయంగా క్రషర్లను ప్రారంభించారనికృష్ణప్రసాద్ తెలిపారు.

దేవినేని ఉమా వ్యవహారంపై స్పందించారు వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. క్వారీ పర్మిషన్లు వున్న భూముల్ని, ప్రభుత్వ భూములంటున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వమే ఆ భూములకు అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. దేవినేని ఉమ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కృష్ణప్రసాద్ అన్నారు. కేఈ కృష్ణమూర్తే స్వయంగా క్వారీ అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి హోదాలో దేవినేని స్వయంగా క్రషర్లను ప్రారంభించారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. 

కాగా, టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. అంతకుముందు దేవినేని ఉమను హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయం నుంచి జూమ్ కాల్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. 

Also Read:ఎస్సీ, ఎస్టీ చట్టం లేకుండా చేయాలని వైసీపీ కుట్రలు...ఇదే ఉదాహరణ: మాజీ మంత్రి నక్కా ఆందోళన

కాగా బుధవారం దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ముందస్తు ప్రణాళికతోనో మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి ఉమ వెళ్లారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా జి.కొండూరులో అలజడికి దేవినేని ఉమే కారణమని...  అందువల్లే ఆయనను అరెస్ట్ చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. 

click me!