మద్యంమత్తులో యువకుల మధ్య ఘర్షణ... నడిరోడ్డుపైనే కత్తులతో నరికి హత్య (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 29, 2021, 05:46 PM ISTUpdated : Jul 29, 2021, 06:15 PM IST
మద్యంమత్తులో యువకుల మధ్య ఘర్షణ... నడిరోడ్డుపైనే కత్తులతో నరికి హత్య (వీడియో)

సారాంశం

మద్యంమత్తులో తెలుగు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన యానాంలో జరిగింది. 

కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చెరిలో భాగమైన యానాంలో తెలుగు యువకుల మధ్య ఘర్షఐ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ముగ్గురు యానాంలో నివాసముంటున్నారు. ఇదే జిల్లా ఐ.పోలవరం మండలంకు చెందిన మరో ఇద్దరు యువకుడు కూడా యానాంలోనే వుంటున్నారు. అయితే మద్యంమత్తులో ఇవాళ(గురువారం) వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

యువలకు మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కొవ్వూరు యువకులు పోలవరంకు చెందిన ఇద్దరిని నడిరోడ్డుపైనే కత్తులతో నరికారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కాకినాడ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

వీడియో

ఈ గొడవపై సమాచారం అందుకున్న యానాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన యువకుల కోసం గాలింపు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!