నాలుగు పార్టీల నుండి తనకు ఆహ్వానాలు అందినట్టుగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.
హైదరాబాద్: టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నుండి ఆహ్వానాలు అందాయని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.సోమవారం నాడు వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు.తాను మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేసినట్టుగా చెప్పారు. ఏడాదిన్నరగా తనను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.తనకు వర్గం లేదు, గ్రూప్ లేదన్న విషయాన్ని వసంత కృష్ణ ప్రసాద్ సమావేశంలో తేల్చి చెప్పారు. పార్టీ మారేది లేదని ఎన్నోసార్లు కూడ ప్రకటించిన విషయాన్ని వసంత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
also read:టీఎస్ స్థానంలో టీజీ: వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా?
undefined
కొన్ని ఘటనలను తనను తీవ్రంగా బాధించాయన్నారు. స్వంత పార్టీ వాళ్లే తనకు బాధ కలిగేలా ప్రవర్తించారని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. తన ఇబ్బందులను పలుమార్లు పార్టీ హైకమాండ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా క్లారిటీ ఇవ్వలేదన్నారు. అభివృద్ది లేని సంక్షేమం సరికాదనేది తన అభిప్రాయంగా వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మూడు పార్టీల నుండి ఆహ్వానాలు ఉన్న విషయాన్ని మీడియాకు చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో మైలవరం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టత ఇవ్వలేదు. తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి కొంత ప్రాంతానికే ఎమ్మెల్యేనని ఆయన చెప్పారు.
also read:రెండు స్థానాల నుండి అధికారం వరకు: బీజేపీ విస్తరణలో అద్వానీదే కీలకపాత్ర
మైలవరం నియోజకవర్గంలో ఇంటలిజెన్స్, ఐప్యాక్ నివేదికలను పార్టీలోనే కొందరు వ్యక్తులు మార్చి సీఎం వద్దకు పంపారని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. తాను వైఎస్ఆర్‌సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు.అయితే ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు.తనపై మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు చేసిన విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.మైలవరం అసెంబ్లీ ఇంచార్జీగా వసంత కృష్ణ ప్రసాద్ ను ఇంచార్జీగా తిరుపతిరావును ఇటీవలనే వైఎస్ఆర్‌సీపీ నియమించింది.