
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఉన్న ఆంధ్రరత్న భవన్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ కార్యాలయ ఆవణలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని అన్నారు. నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదని ఆరోపించారు.
‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’.. అంటూ కేటీఆర్ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించి అన్నారో ?
తనకు ఎవరూ కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎవరూ కితాబు ఇవ్వకపోయినా తన విలువ ఎక్కువ కాదని, అలాగని తక్కువ కాదని తెలిపారు. తాను వైఎస్ కూతురుని అయినపుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని ఆమె ప్రశ్నించారు. తన కుమారుడికి వైఎస్ రాజా రెడ్డి అని పేరు పెట్టుకున్నానని చెప్పారు. తనకు ఆత్మీయుడిన నమ్మిన బొండా రాఘవ రెడ్డి కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిదని తెలిపారు.
రైతులకు గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల రుణ మాఫీపై తెలంగాణ గవర్నర్ కీలక ప్రకటన..
అవన్నీ ఆరోపణలు నిజం కాదని తాను ప్రమాణం చేయగలనని వైఎస్ షర్మిల అన్నారు. ఈ విషయంలో బొండా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించుకోడానికి తన భర్తతో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ రోజు వరకు ఏమీ ఆశించి అన్న వద్దకు వెళ్ళలేదని, దానికి సాక్ష్యం అమ్మే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో దమ్ముంటే తన అమ్మను అడగాలని సవాల్ విసిరారు.
వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. మొదటి స్పందన ఏంటంటే ?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్దేశించి వైఎస్ షర్మిల మాట్లాడారు. ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయని, కానీ సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదని ఆమె ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొడుతున్నారని, అవమానిస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలను ప్రజలు దూరం పెట్టాలని, గణతంత్ర దినోత్సవం రోజే ఈ విషయంలో ప్రజలు ప్రమాణం చేయాలని కోరారు.