ముగిసిన ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు.. తరలివచ్చిన విశాఖ వాసులు

sivanagaprasad kodati |  
Published : Oct 07, 2018, 05:12 PM IST
ముగిసిన ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు.. తరలివచ్చిన విశాఖ వాసులు

సారాంశం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు విశాఖ వాసుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి.

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు విశాఖ వాసుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మధ్యాహ్నం సిరిపురంలోని నివాసం నుంచి మూర్తి పార్థీవ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం.. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలించారు. 

అనంతరం అక్కడి నుంచి రుషికొండలోని గీతం యూనివర్సిటీ ప్రాంగణానికి అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతిమయాత్రలో నడిచారు. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చితికి మూర్తి కుమారుడు నిప్పంటించారు.

మూర్తికి గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వందనం సమర్పించారు. మంత్రులు నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకు ముందు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు ఎంవీవీఎస్ మూర్తి భౌతిక కాయానికి నివాళులర్పించారు. 

ఎంవీవీఎస్‌ మూర్తికి వెంకయ్య నివాళులు.. మంచి మిత్రుడిని కోల్పోయా: ఉపరాష్ట్రపతి

ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం.. మూర్తి నివాసం వద్ద విషాదఛాయలు

మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఏర్పాట్లను సమీక్షిస్తున్న తానా

మూర్తిగారిని మొన్ననే మండలి సమావేశాల్లో చూశా.. ఇంతలోనే: నారా లోకేశ్

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

PREV
click me!

Recommended Stories

వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం.. తండ్రీ - కొడుకుల సవాల్ | Asianet News Telugu
రక్తచరిత్ర కావాలా చంద్రబాబు | YS Jagan Sensational Statement | AP Localbody Elections 2026