జగన్‌ నాకు శత్రువు కాదు: పవన్ సంచలనం

Published : Oct 07, 2018, 04:59 PM ISTUpdated : Oct 07, 2018, 05:07 PM IST
జగన్‌ నాకు శత్రువు కాదు: పవన్ సంచలనం

సారాంశం

 రాజకీయాల్లో  గెలుపు ఓటములు సహజమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.


ఏలూరు: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తనకు శత్రువు కాదన్నారు. తనకు శత్రువులెవరూ కూడ లేరని  చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో వపన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్  వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడ  ఘాటుగానే స్పందించారు. తాను కూడ  వ్యక్తిగత విమర్శలు చేయగలనని చెప్పారు. 

రాజకీయాల్లో  గెలుపు ఓటములు సహజమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాను పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో  ఎన్టీఆర్ మాదిరిగా ఉప్పెన లేదన్నారు. తన సోదరుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో అభిమానుల ప్రవాహం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.  

పరిస్థితులను ఎదురీదుతూ  పార్టీని ఏర్పాటు చేసినట్టు పవన్ గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు  తెలిపారు. మోసాలు చేస్తే  చూస్తూ ఊరుకోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. పాలకులు పంచాయితీరాజ్ వ్యవస్థను నాశనం చేశారని  అభిప్రాయపడ్డారు. 

 


 

PREV
click me!

Recommended Stories

CM Nara Chandrababu Naidu Speech: మెప్మా, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | Asianet Telugu
Pemmasani Chandrasekhar Spech: 25 సంవత్సరాల ముందు చంద్రబాబు విజన్ ఈ సంఘాలు| Asianet News Telugu