ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

By sivanagaprasad kodatiFirst Published Oct 3, 2018, 7:57 AM IST
Highlights

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో తెలుగుదేశం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో తెలుగుదేశం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మంత్రిమండలి సమావేశంలో పాల్గొనేందుకు అమరావతి వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. మూర్తి మరణవార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు. వెంటనే విశాఖ వెళ్లి ఎంవీవీఎస్ కుటుంబసభ్యులను ఓదార్చి.. అక్కడి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో గంటా హుటాహుటిన విశాఖపట్నం బయలు దేరారు. 

లాస్ ఏంజెల్స్ నుంచి అలస్కా వెళుతుండగా మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్‌తో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిని బసవపున్నయ్య వెలువోలు, ప్రసాద్ వీరమాచినేని,వెంకటరత్నం కడియాల, చిన్నాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఎన్ఆర్ఐలు.. వీరంతా ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. 

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

click me!