ఏవోబీలో మావోల బహిరంగ సభ:గురుప్రియను ఆపెయ్యాలి

Published : Oct 02, 2018, 08:54 PM IST
ఏవోబీలో మావోల బహిరంగ సభ:గురుప్రియను ఆపెయ్యాలి

సారాంశం

మావోయిస్టులకు మంచిపట్టున్న ప్రాంతంగా చెప్పుకునే ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో మళ్లీ అలజడి రేపారు. ఏవోబీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒడిస్సా పోలీసులు గ్రేహౌండ్స్ సిబ్బందితో కూంబింగ్ చేపడుతున్నా ఏ మాత్రం భయాందోళన చెందకుండా మావోయిస్టులు బహిరంగ సభ నిర్వహించారు.   

విశాఖపట్నం: మావోయిస్టులకు మంచిపట్టున్న ప్రాంతంగా చెప్పుకునే ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో మళ్లీ అలజడి రేపారు. ఏవోబీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒడిస్సా పోలీసులు గ్రేహౌండ్స్ సిబ్బందితో కూంబింగ్ చేపడుతున్నా ఏ మాత్రం భయాందోళన చెందకుండా మావోయిస్టులు బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ బహిరంగ సభలో సుమారు 2వేల మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఏవోబీలోని కటాఫ్‌ ఏరియాలో నిర్వహించిన ఈ సభలో 7 పంచాయతీలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు. బలిమెలపై గురుప్రియ వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. 

గురుప్రియ వంతెన వల్ల గిరిజనులకు ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. బలిమెల రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో రైతులు పంటలు నష్టపోతున్నారని, నీటిమట్టం పెరిగినప్పుడల్లా వందల ఎకరాల్లో పంట ముంపునకు గురవుతుందోని వారు ఆరోపించారు.

మరోవైపు మావోయిస్టులు సభకు వెళ్తున్నప్పుడు గ్రేహౌండ్స్ కు మధ్యలో తారసపడ్డారని కాల్పులు జరిపేలోపు తప్పించుకున్నారని తెలుస్తోంది. గ్రేహౌండ్స్ సిబ్బందికి బోర్డర్ సరిహద్దులు తెలియకపోవడంతో మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. 

రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఉన్నారని తెలియడంతో గ్రేహౌండ్స్ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. అయితే గ్రామం భౌగోళిక సరిహద్దులు తెలియకపోవటంతో మావోయిస్టులు తప్పించుకుపోయారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని గ్రేహౌండ్స్ బలగాలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే