అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధించింది విశాఖపట్నం కోర్టు.
విశాఖపట్నం : ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నగరంలోని పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి లాలం శ్రీధర్ సోమవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నాగరాజు (42) ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చట్టుబంద గ్రామానికి చెందిన వాడు. వృత్తి వ్యవసాయం.
మృతుడు కె మల్లేశ్వరరావు (28) కూడా అదే గ్రామానికి చెందిన వాడు. నేరం జరగడానికి ఆరు నెలల ముందే నాగరాజు కూలి పనుల నిమిత్తం చెన్నై వెళ్ళాడు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అతని ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రేడియో, ఇంట్లోనే కొన్ని వస్తువులు కనిపించలేదు. వాటిని మల్లేశ్వరరావు దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. 2015 జూన్ 3న రాత్రి మల్లేశ్వరరావు లోతభీమయ్యకు చెందిన జీడి మామిడి తోటలోని పూరిపాకలో నిద్రపోతున్నాడు. ఇదే అదనుగా నాగరాజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద కర్రతో మల్లేశ్వరరావుపై దాడి చేసి తల, భుజం, ముక్కుపై బలంగా కొట్టాడు.
undefined
తీవ్రగాయాలతో బాధపడుతున్న మల్లేశ్వరరావును అతని బంధువులు నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విశాఖ తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 4న అతను మరణించాడు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీస్ ఇన్స్పెక్టర్ జి. సోమశేఖర్, నర్సీపట్నం ఉప పోలీస్ సూపరింటెండెంట్ బి. సత్య ఏసుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు హత్యానేరంతోపాటు, గిరిజన చట్టం 3(2)(5)కింద కూడా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు నేరాల్లో యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అయితే, 2 శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు.
క్షుద్రపూజల పేరుతో సొంత చెల్లెలి హత్య.. పేగులు తీసి, ముక్కలుగా నరికి దహనం..!!
ఇదిలా ఉండగా, ఆగ్రా లోని నాగ్లా మేవతిలోని అపార్ట్మెంట్లో రితికా సింగ్ అనే వివాహిత హత్యకు గురయింది. ఆమె ఘజియాబాద్ నివాసి. ఫిరోజాబాద్ నివాసి అయిన ఆకాష్ గౌతమి 2014లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్ తన ఫేస్బుక్ తన స్నేహితుడు విపుల్ అగర్వాల్ తో నాగ్లా మేవతిలోని అపార్ట్మెంట్లో కలిసి ఉంటుంది. ఇదిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారు.
ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యింది రితిక. వచ్చినవారంతా రీతిగా ప్రియుడిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు అంతటితో ఊరుకోకుండా.. రితిక చేతులు కట్టేసి నాలుగో అంతస్తు నుంచి కిందకి తోసి చంపేశారు. ఈ మేరకు స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ లో తెగ వైరల్ అవుతుంది.