నేను బీజీపీ మనిషిని: పాదయాత్రగా తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్ బాబు, తనయులు

By narsimha lode  |  First Published Jun 28, 2022, 10:33 AM IST


తాను బీజేపీ మనిషినని సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకొనే వారిలో తాను ఒక్కడినని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో తనపై నమోదైన కేసులో తిరుపతి కోర్టుకు మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులతో కలిసి హాజరయ్యారు.

Cine Actor Mohan Babu And His Sons Appeared Before Tirupati Court

తిరుపతి:తాను బీజేపీ మనిషినని సినీ నటుడు Mohan Babu చెప్పారు. కేంద్రంలో BJP అధికారంలో ఉండాలని కోరుకొనే వ్యక్తుల్లో తాను ఒకడినని ఆయన చెప్పారు.మంగళవారం నాడు Tirupatiలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో తన కాలేజీలో చదువుకునే విద్యార్ధులకు fee reimbursement,ఇవ్వాలని డిమాండ్ తో మోహన్ బాబు ధర్నా చేశారు.ఈ ధర్నా విషయమై అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది.ఈ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు మోహన్ బాబు తిరుపతికి వచ్చారు. తిరుపతిలోని NTR సర్కిల్ నుండి మోహన్ బాబు, ఆయన ఇద్దరు కొడుకులు  మంచు విష్ణు, మంచు మనోజ్ పాదయాత్రగా కోర్టుకు బయలుదేరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్  చేశారు. విద్యార్ధుల కోసం తాను పోరాటం చేస్తే తనపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. తాను రియల్ హీరోనని ఆయన చెప్పారు.2014 నుండి 2019 వరకు  మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్  ప్రభుత్వం నుండి రాలేదు. దీంతో పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడ  ఈ డబ్బులు చెల్లించలేదని అప్పట్లో మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయమై అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ అధికారులతో మాట్లాడినా కూడా ఫలితం దక్కలేదన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ  2019 ఎన్నికలకు ముందు తన కాలేజీ విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు గాను మోహన్ బాబుతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేఃసులో మోహన్ బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.

Latest Videos

2019 ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీలో చేరారు. 2019 మార్చి 26న వైసీపలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపి విజయం కోసం మోహన్ బాబు  ప్రచారం చేశారు.  మోహన్ బాబు పెద్ద కొడుకుకు  వైఎస్ఆర్ కుటుంబానికి బంధుత్వం ఉంది. 

2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిశారు. 2019 తర్వాత కూడా మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మోడీని కలిశారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో తనకు బీజేపీతో ఉన్న సంబంధాల గురించి మోహన్ బాబు గుర్తు చేసుకొన్నారు. ఇవాళ కోర్టుకు హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చిన సమయంలో మోహన్ బాబు చిట్ చాట్ చేసే సమయంలో తాను బీజేపీ మనిషినని చెప్పారు.
 

vuukle one pixel image
click me!