నన్ను, నా భార్యను ఇంట్లోనే దగ్దం చేయాలని చూశారు: వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్

By narsimha lode  |  First Published Jun 28, 2022, 9:41 AM IST

తనను, తన బార్యను ఒంట్లోనే దగ్దం చేయాలని ఆందోళనకారులు ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆరోపించారు. ఈ ఏడాది మే 24న జరిగిన అల్లర్లపై ఆయన మరోసారి స్పందించారు.  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే  ఎందుకు బాధ అని ఆయన ప్రశ్నించారు. 


అమలాపురం: తనను, తన భార్యను ఇంట్లోనే దగ్ధం చేయాలని ఆందోళనకారులు ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే Ponnada Satish ఆరోపించారు. 

ఈ ఏడాది మే 24న జరిగిన Amalapuram అల్లర్ల ఘటనపై పొన్నాడ సతీష్ స్పందించారు. Konaseema జిల్లాకు Ambedkar కోనసీమ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదనపై కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లను,  YCP ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని ఆందోళనకారులు దగ్దం చేశారు.

Latest Videos

undefined

 మంత్రి Viswaroop  ను తనను చంపేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ పేరు వాడితే ఎందుకు బాధ అని ఆయన ప్రశ్నించారు. అల్లర్లతో కోనసీమ పదేళ్లు వెనక్కి వెళ్లిందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అభిప్రాయపడ్డారు. కొందరు వ్యక్తులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారన్నారు.

కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 24న కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్  రెండు ఇళ్లకు నిప్పంటించారు. వైసీపీఎమ్మెల్యే Satishఇంటికి నిప్పు పెట్టారు. తొలుత ప్రకటించినట్టుగానే కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ ఆందోళనకారులు చేసిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. 

కోనసీమ జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ తరుణంలోఈ నెల 24న  జరిగిన కేబినెట్ సమావేశంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జిల్లాలో ఎలాంటి  హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ తో పాటు 30 పోలీస్ యాక్ట్ ను కూడా పోలీసులు అమల్లోకి తెచ్చారు. 

కోనసీమ అల్లర్ల కేసులో మరో 18 మందిని ఇటీవలనే అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక మైనర్ కూడా వున్నాడు. వీరితో కలిపి కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 217కి చేరింది. వీరిలో మొత్తం ఆరుగురు మైనర్లు వున్నారు.

ఈ ఘటనల్లో 268 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు 7 బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. గతవారం ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను A-225గా సత్యరుషి,  A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 

click me!