వెంకన్న చౌదరి వ్యాఖ్యలు: మరోసారి మురళీ మోహన్ క్షమాపణలు

First Published Jun 23, 2018, 11:37 AM IST
Highlights

తిరుమల వేంకటేశ్వర స్వామిని వెంకన్నచౌదరి అంటూ తాను సంబోధించిన విషయంపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ మరోసారి వివరణ ఇచ్చారు.

తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామిని వెంకన్నచౌదరి అంటూ తాను సంబోధించిన విషయంపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ మరోసారి వివరణ ఇచ్చారు. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇటీవల వెంకన్నస్వామి అనబోయి పోరపాటున వెంకన్న చౌదరి అంటూ నోరు జారానని ఆయన చెప్పారు. దేవుడికి కులాన్ని అంటగట్టే వ్యక్తిని కాదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో భక్తులంతా తనను క్షమించాలని ఆయన కోరారు.
 
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీల రాజీనామాలపై కూడా ఆయన స్పందించారు. చీకటి ఒప్పందలో భాగమే వైసీపీ ఎంపీల రాజీనామాలని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలకు అవకాశం లేకుండా రాజీనామాలను ఆమోదించారని అన్నారు. 

కడపలో ఉక్కు పరిశ్రమ కోసం తమ పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టిన ఆమరణ దీక్షకు అందరం సంఘీభావం ప్రకటించామని ఆయన తెలిపారు.

click me!